నేడు ట్రిపుల్‌ఐటీ నోటిఫికేషన్‌ విడుదల

ABN , First Publish Date - 2023-06-02T23:06:11+05:30 IST

రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో నడుస్తున్న రాష్ట్రంలోని నా లుగు ట్రిపుల్‌ఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరంలో సీట్ల భర్తీకి శనివారం నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ మేరకు ఆర్జీయూకేటీ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కేసీరెడ్డి ఇతర అధికారులు శుక్రవా రం నోటిఫికేషన్‌ వివరాలను విలేకరుల కు వెల్లడించారు.

నేడు ట్రిపుల్‌ఐటీ నోటిఫికేషన్‌ విడుదల

4,400 సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం

రేపటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు

వేంపల్లె, జూన్‌ 2: రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో నడుస్తున్న రాష్ట్రంలోని నా లుగు ట్రిపుల్‌ఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరంలో సీట్ల భర్తీకి శనివారం నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ మేరకు ఆర్జీయూకేటీ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కేసీరెడ్డి ఇతర అధికారులు శుక్రవా రం నోటిఫికేషన్‌ వివరాలను విలేకరుల కు వెల్లడించారు. ఈ ఏడాది ఇడుపులపాయ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ఐటీల్లో 4,000 సీట్లు, ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 400 సీట్లు మొత్తం 4,400 మంది విద్యార్థులను చేర్చుకునేందుకు ఈ నోటిఫికేషన్‌ విడుదల చేశా రు.

ఇంటర్‌తో ఇంజనీరింగ్‌ పట్టా అం దించే ఆరేళ్ల సమీకృత ఇంజనీరింగ్‌ కో ర్సుకు ఈ ఏడాది 10వ తరగతి పాసైన విద్యార్థులు అర్హులు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టులో 4మార్కులు వెయిటేజీ ఇవ్వనున్నారు. 10వ తరగతి మార్కుల మెరిట్‌ ఆధారంగా రిజర్వేషన్‌ ప్రాతిపదికన సీట్లను కేటాయిస్తారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు....

ఆర్జీయూకేటీ నోటిఫికేషన్‌ అధికారికంగా శనివారం విడుదల కానుంది. 4వ తేదీ ఆదివారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కేసీరెడ్డి తెలియజేశారు. జూన్‌ 26వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఇచ్చారు. జులై 13వ తేదీ న 10వ తరగతి మార్కుల మెరిట్‌, రిజర్వేషన్‌ ప్రాతిపదికన జాబితా విడుదల చేస్తారు. జులై 21 నుంచి 27వ తేదీ వరకు ట్రిపుల్‌ఐటీల్లో ఎంపికైన విద్యార్థులకు అడ్మిషన్‌ ప్రక్రియ నిర్వహిస్తారు. ఆగస్టు మొదటి వారంలో విద్యార్థులకు తరగతులు ప్రారంభం అవుతాయి.

Updated Date - 2023-06-02T23:06:11+05:30 IST