పాలకుల నిర్లక్ష్యంతోనే ట్రాఫిక్ సమస్యలు
ABN , First Publish Date - 2023-03-19T23:28:46+05:30 IST
పట్టణం లో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాకపో వడానికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని పలువురు వక్తలు పేర్కొన్నారు.

మదనపల్లె అర్బన, మార్చి19: పట్టణం లో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాకపో వడానికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆది వారం స్థానిక ఎనజీవో హోమ్‌లో పట్ట ణంలో ట్రాఫిక్ సమస్యపై మదనపల్లె ఐదక్యవేదిక ఆధ్వర్యంలో చర్చావేదిక నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో అపెక్స్ అసో సియేషన అధ్యక్షుడు తిరుపతిరావు, పెన్షన ర్స్ అసోసియేషన అధ్యక్షుడు బీటీ నరసంహులు, మదనపల్లె ఐక్యవేదిక నాయకులు పురం వెంకటరమణ, హరిశర్మ, నవజీవన అసోసియేషన నాయకుడు జి. కృష్ణమూర్తి, రచయితల సంఘం నాయకుడు కృష్ణమూర్తి, జనవిజ్ఞాన వేదిక నాయకులు బాషా, ఎంవీచలపతి తదితరులు ప్రసంగించారు. వంద అడుగుల రోడ్లు 40 అడుగులకు కుంచించుకుపోతున్నాయని, ఆక్రమణలు తొలగించి రోడ్డుకు ఇరువైపుల మురుగనీ టికాలువలు, వాటిపై పుట్‌పాతలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బిజినెస్ ఉన్న ఏరియాల్లో పార్కింగ్ కల్పించాలని కోరారు. భారీ వాహనాలరు పట్టణంలోకి అనుమతించరాదని, మార్కెట్ యార్డులోకి వారపు సంతను, వారపుసంతలోకి దినసరి మార్కెట్, చేపల మార్కెట్‌ను తరలించాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ సమస్యలు పరిష్కారమయ్యే వరకు అన్ని ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలను కలుపుకొని ఉద్య మం చేయాలని నిర్ణంచారు.