ట్రాక్టర్ బోల్తా - 11 మంది విద్యార్థులకు గాయాలు
ABN , Publish Date - Dec 26 , 2023 | 11:10 PM
వనంబావి సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో 11 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. అందు లో ఓ విద్యార్థి కాలునుజ్జునుజ్జు అయింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల్లోకెళితే....
లింగాల,డిసెంబరు 26: వనంబావి సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో 11 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. అందు లో ఓ విద్యార్థి కాలునుజ్జునుజ్జు అయింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల్లోకెళితే.... వనంబావి ఆలయం వద్ద అన్నదానం జరుగుతోందని లింగాల బీసీ హాస్టల్ విద్యార్థులు వెళ్లారు. 2:30గంటలకు తిరుగు ప్రయాణంలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. అకస్మాత్తుగా ట్రాక్టర్ ట్రాలీ పైకి లేవడం, అదేసమయంలో టర్నింగ్ రావడంతో అంతా ఒకవైపుగా ఒరిగిపోవడంతో ఒక్కొక్కరుగా కిందపడినట్లు తెలిపారు. కొందరు తప్పించుకుని దూకగా మరికొందరు కిందపడిపోయారు. ఆ సమయం లో దాదాపు 67 మంది ప్రయాణిస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు.
ఈ ప్రమాదంలో 11 మంది లింగాల బీసీ హాస్టల్ విద్యార్థులకు తలకు, మోకాళ్లకు, చేతులకు, భుజాలకు, నుదురుకు గాయాలపాలయ్యారు. వీరిలో అరుణ్ అనే విద్యార్థి కాలు నుజ్జునుజ్జు అయింది. క్షత గాత్రులను ప్రథమ చికిత్స కోసం లింగాల పీహెచ్‌సీకి తరలించి మెరుగైన చికిత్సకోసం పులివెందు ల ఏరియా ఆస్పత్రికి తరలించా రు. అరుణ్‌ను కడప రిమ్స్‌కు తరలించినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యార్థు ల తల్లిదండ్రులు ఆస్పత్రికి వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. పులివెందుల ఆర్డీఓ వెం కటేశులు ఏరియా ఆస్పత్రికి చేరు కుని సంఘటన వివరాలు తెలుసుకుని విద్యార్థులను పరామర్శించి దైర్యంగా ఉండాలని సూచించారు. ప్రమాదంపై కేసు నమోదు చేయనున్నట్లు లింగాల ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు.