ప్రభుత్వ సహకారంతోనే పర్యాటకాభివృద్ధి

ABN , First Publish Date - 2023-09-04T23:36:58+05:30 IST

ప్రభుత్వ సహకారంతోనే పర్యాటక రంగం అభివృద్ధి చెందగలదని పర్యాటక పితామహుడు సిద్దవటం సీతారామయ్య అన్నారు.

ప్రభుత్వ సహకారంతోనే పర్యాటకాభివృద్ధి
ప్రభుత్వ సహకారంతోనే పర్యాటక రంగం అభివృద్ధి చెందగలదని పర్యాటక పితామహుడు సిద్దవటం సీతారామయ్య అన్నారు.

కడప (ఎడ్యుకేషన్‌), సెప్టెంబరు 4 : ప్రభుత్వ సహకారంతోనే పర్యాటక రంగం అభివృద్ధి చెందగలదని పర్యాటక పితామహుడు సిద్దవటం సీతారామయ్య అన్నారు. సోమవారం పాత కలెక్టరేట్‌ ఇంటాక్‌ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశానికి ఆయన హాజరయ్యారు. 2007లో వైఎ్‌సఆర్‌ రాష్ట్ట్రమంతటా పర్యాటక రంగాలు బలమైన పునాదులు వేశారని ప్రస్తుత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గండికోటలో ఒబెరాయ్‌ హోటల్‌ ఏర్పాటు చేస్తుండడంతో దానికి అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తుందనాన్నరు. త్వరలో మరో స్టార్‌ హోటల్‌ వచ్చే అవకాశం ఉందన్నారు. అంతటి ఘనమైన వారసత్వ సంపదను రక్షించేంఉదకు ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించాలన్నారు. ఇంటాక్‌ కన్వీనరు మానస కె.చిన్నపరెడ్డి మాట్లాడుతూ జిల్లాకు తలమానికంగా ఘనమైన వారసత్వ సంపదకు ప్రతీకగా ఉన్న పాత కలెక్టరేట్‌ భవనానికి మరమ్మతులు చేపడుతున్న జిల్లా అధికారుల సేవలను కొనియాడారు. లయన్స్‌ క్లబ్‌ జిల్లా అధ్యక్షులు పోతుల వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ గండికట అభివృద్ధితో జిల్లా అంతటా పర్యాటకరంగంలో అభివృద్ధి వేగం పుంజుకుందన్నారు. ఇంటాక్‌ కో కన్వీనరు సుబ్బారెడ్డి, పూర్వ కన్వీనరు పాలెం వేణుగోపాల్‌ మాట్లాడారు.

Updated Date - 2023-09-04T23:37:25+05:30 IST