పొగాకు వాడకం హానికరం

ABN , First Publish Date - 2023-05-31T23:17:26+05:30 IST

పొగాకు వాడకంతో ఆరోగ్యం క్షీణిస్తుందని, ‘పొగాకు వద్దు ఆరోగ్యమే ముద్దు’ నినాదంతో పట్టణంలో జిల్లా వైద్యశాఖాధికారి ఎన్‌.కొండయ్య అధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

పొగాకు వాడకం హానికరం
ర్యాలీ నిర్వహిస్తున్న డీఎంహెచ్‌ఓ కొండయ్య

రాజంపేట, మే31: పొగాకు వాడకంతో ఆరోగ్యం క్షీణిస్తుందని, ‘పొగాకు వద్దు ఆరోగ్యమే ముద్దు’ నినాదంతో పట్టణంలో జిల్లా వైద్యశాఖాధికారి ఎన్‌.కొండయ్య అధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ పొగాకు దినోత్సవం సంద ర్భంగా పొగాకుతో జరిగే అనర్థాలను ప్రజలకు వివరించడానికి ఈర్యాలీ నిర్వహిస్తున్నా మన్నారు. యువకులు, వయస్సు మీరిన పెద్దలు ప్రతి ఒక్కరూ పొగాకు వాడకానికి దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ చెన్నకృష్ణ, పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు పిల్లి పిచ్చయ్య, టీబీ సూపరింటెండెంట్‌ జయ ప్రకాష్‌, సిద్ధిరామయ్య, వైద్యులు లక్ష్మీప్రసన్న, మస్తాని, అశోక్‌, వికాస్‌ పాల్గొన్నారు.

ఓబుళవారిపల్లెలో ర్యాలీ...

ఓబులవారిపల్లె, మే31: ముక్కావారిపల్లె పీహెచ్‌సీ వైద్య సిబ్బంది అధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. డాక్టర్‌ రాజశేఖర్‌, డాక్టర్‌ రూప మా ట్లాడుతూ ఆహారం ముద్దు పొగాకు వద్దు అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. పొగా కు, వాటి ఉత్పత్తుల వలన కలిగే దుష్ప్రచారాలు గురించి ప్రజలకు వివరించారు. ఒక సిగరెట్‌ తాగడం వలన జీవిత కాలంలో పది నిమిషాల పాటు ఆయువు తగ్గించు కోవడమన్నారు. నోటి క్యాన్సర్‌ ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వంటి భయంకరమైన వ్యాధులు సంభవించి అకాల మరణం పొందాల్సి వస్తుందని ముఖ్యంగా యువత గుర్తించుకోవా లని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-31T23:17:26+05:30 IST