దేశభక్తులను స్మరించుకునేందుకే ‘నా మట్టి.. నాదేశం’
ABN , First Publish Date - 2023-09-25T22:58:37+05:30 IST
జాతీయస్ఫూర్తి అమరవీరుల త్యాగమే మేరా మిట్టీ.. మేరా దేశ్ అని తహసీల్దార్ ఉదయశంకర్‌రాజు, ఎంఈఓ చక్రే నాయక్, వెంకటసుబ్బయ్య తెలిపారు.

లక్కిరెడ్డిపల్లె, సెప్టెంబరు 25: జాతీయస్ఫూర్తి అమరవీరుల త్యాగమే మేరా మిట్టీ.. మేరా దేశ్ అని తహసీల్దార్ ఉదయశంకర్‌రాజు, ఎంఈఓ చక్రే నాయక్, వెంకటసుబ్బయ్య తెలిపారు. సోమవారం స్థానిక ఎమ్మార్సీ సభాభవనంలో లక్కిరెడ్డిపల్లెలోని ఏపీ మోడల్ స్కూల్, జడ్పీ బాలుర, బాలికల పాఠ శాలల విద్యార్థులు ప్రతి గ్రామం నుంచి మట్టి సేకరించాలన్నారు.ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, సుబ్బారెడ్డి, సీఆర్‌పీలు రామ్మోహన్, చంద్రకళ, ఎంఐఎం రామాంజనేయులు, మల్లికార్జున, విద్యార్థులు పాల్గొన్నారు.
చిన్నమండెం: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో సోమవారం నాభూమి- నాదేశం (మేరా మట్టి- మేదాదేశ్) కార్యక్రమాన్ని ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు సర్తాజ్‌బేగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొదట ఒక కలశాన్ని ఏర్పాటు చేసి విద్యార్థినీ, విద్యార్థులు అందులో గుప్పెడు మట్టిని వేశారు. ఆ కలశంపై మేరా మట్టి- మేరా దేశ్ అని రాసి విద్యార్థులందరూ జాతీయ నాయకుల చిత్రపటాలు, జాతీయ జెండాలు పట్టుకుని పాఠశాల ఆవరణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పంచ్‌ప్రాణ్ ప్రతిజ్ఞ చేశారు.