ప్రభుత్వ లక్ష్యాల సాధనకు పాటుపడాలి

ABN , First Publish Date - 2023-03-07T00:01:11+05:30 IST

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నిర్దేశించిన అంధ్ర ప్రదేశ్‌ సేవా , ఆధార్‌ సర్వీసెస్‌, ఆయుష్మాన్‌ భారత్‌, ఎస్‌డీజీ సర్వేల్లో ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాల సాధనకు ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషన ర్లు తగు చర్యలు తీసుకోవాలని జీఎ్‌సడబ్ల్యూఎస్‌ అధికారి, జడ్పీ సీఈవో మన్నూరు సుధాకర్‌రెడ్డి సూచించారు.

ప్రభుత్వ లక్ష్యాల సాధనకు పాటుపడాలి

జీఎ్‌సడబ్ల్యూఎస్‌ అధికారి సుధాకర్‌రెడ్డి

కడప(రూరల్‌) మార్చి 6 : గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నిర్దేశించిన అంధ్ర ప్రదేశ్‌ సేవా , ఆధార్‌ సర్వీసెస్‌, ఆయుష్మాన్‌ భారత్‌, ఎస్‌డీజీ సర్వేల్లో ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాల సాధనకు ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషన ర్లు తగు చర్యలు తీసుకోవాలని జీఎ్‌సడబ్ల్యూఎస్‌ అధికారి, జడ్పీ సీఈవో మన్నూరు సుధాకర్‌రెడ్డి సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల పనితీరు...లక్ష్యాలపై సోమవారం జిల్లాలోని ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిశు అభివృద్ది సంస్ధ గర్భిణుల సర్వేలో జిల్లా కొద్దిగా మెరుగుపడిందని, మరింత పురోగతి సాధించాలన్నారు., ఐదేళ్ల లోపు బాలల సర్వేను సకాలంలో పూర్తిచేయాలన్నారు. ఆరోగ్య సిబ్బందికి సంబంధించిన గర్భిణుల సర్వేలో వెనుకబడిన మండలాల్లో ప్రత్యేక దృష్టి సారించి స్ధాయిని మెరుగుపరుచుకోవాలన్నారు. ఐదేళ్లలోపు బాలల సర్వేలో చాలా మండలాలు వెనకబడ్డాయన్నారు. 6 నుంచి 19 ఏళ్ల వయసు వారి సర్వేలో రూరల్‌, అర్బన్‌ ప్రాంతాల్లో పురోగతి కనిపించడం లేదన్నారు. జిల్లాలోని సచివాలయాల పని తీరును రాష్ట్రస్ధాయి, జిల్లా స్ధాయి అధికారులు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారన్న విషయాన్ని ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు మర్చిపోవద్దన్నారు. ఇప్పకికైనా ఆశ్రద్ధ వహించకుండా వారి పరిదిలోని సచివాలయ సిబ్బందిని సమన్వయ పరిచి జిల్లా రిపోర్టులను ఎప్పటికప్పుడు స్టడీ చేస్తూ తగిన సమయాన్ని కేటాయించుకుంటే ఆశించిన పురోగతిని సాధించడానికి వీలుపడుతుందన్నారు.

Updated Date - 2023-03-07T00:01:11+05:30 IST