Share News

డ్రైవర్‌పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

ABN , First Publish Date - 2023-10-30T00:18:56+05:30 IST

అకార ణంగా ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిం చాలని పీలేరులోని ఏపీఎస్‌ ఆర్టీసీ కార్మిక సంఘ నేతలు ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

డ్రైవర్‌పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
పీలేరు డిపో ఎదుట నిరసన తెలియజేస్తున్న కార్మిక సంఘ నేతలు

పీలేరు, అక్టోబరు 29: అకార ణంగా ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిం చాలని పీలేరులోని ఏపీఎస్‌ ఆర్టీసీ కార్మిక సంఘ నేతలు ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కావలి ఘటనకు వ్యతిరేకంగా ఆదివా రం పీలేరు డిపో గేటు ముందు డిపోలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కావలి సమీపంలో డ్రైవర్‌ రాంసింగ్‌పై దాడి చేసిన వారందరిపై కఠినంగా వ్యవహరించడమే కాకుండా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సీవీ రమణ, నాగరాజ, ఎస్‌కే బాషా, మణి, వేణు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-30T00:18:56+05:30 IST