గడువు లోపు పనులు పూర్తికావాలి : కలెక్టర్
ABN , First Publish Date - 2023-05-02T23:22:45+05:30 IST
నిర్ణీత గడువులోపు మోడల్ టౌనలో జరుగుతున్న పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ విజయరామరాజు అధికారులను ఆదేశించారు.
పులివెందుల టౌన, మే 2: నిర్ణీత గడువులోపు మోడల్ టౌనలో జరుగుతున్న పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ విజయరామరాజు అధికారులను ఆదేశించారు. మంగళవారం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో అధికారుల సమీక్షలో ఆయన మాట్లాడుతూ మోడల్ టౌనలో భాగంగా జరుగుతున్న అన్ని పనులను ఎప్పటికప్పుడు అధి కారులు పర్యవేక్షించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఇప్పటివరకు జరిగిన పనులను అధికా రులు కలెక్టర్‌కు వివరించారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పను లను ఓఎస్డీ అనిల్ కుమార్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. కార్యక్ర మంలో ఆర్డీఓ వెంకటేశులు, తహసీల్దార్ మాధవ కృష్ణారెడ్డి, మున్సిపల్ కమి షనర్ నరసింహారెడ్డి అన్ని శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.