కార్యదర్శులకు పని భారం తగ్గించాలి

ABN , First Publish Date - 2023-05-31T23:19:19+05:30 IST

గ్రామ, వార్డు సచివాలయ హెల్త్‌ కార్యదర్శులకు పని భారం తగ్గించాలని ఏపీ గ్రామ, వార్డు సచివాలయ సెక్రెటీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లీలావతి, ఉప ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాం డ్‌ చేశారు.

కార్యదర్శులకు పని భారం తగ్గించాలి
సమావేశంలో మాట్లాడుతున్న లీలావతి

రైల్వేకోడూరు, మే 31: గ్రామ, వార్డు సచివాలయ హెల్త్‌ కార్యదర్శులకు పని భారం తగ్గించాలని ఏపీ గ్రామ, వార్డు సచివాలయ సెక్రెటీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లీలావతి, ఉప ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాం డ్‌ చేశారు. బుధవారం రైల్వేకోడూరు సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఆన్‌లైన్‌యాప్‌ల భారంతో హెల్త్‌ కార్యద ర్శులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 2021 అక్టోబర్‌లో ప్రొబేషన్‌ పూర్తి అయినా 2022 జూన్‌ వరకు పెంచిన జీతాలు ఇవ్వలేదన్నారు. తక్షణమే పెం డింగ్‌ జీతాలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

శెలవులు తీసుకోవ డానికి పంచాయతీ, మెడికల్‌ అధికారులను అందరినీ అడుక్కోవాల్సి వస్తోం దన్నారు. మహిళలు అయిన హెల్త్‌ కార్యదర్శులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా బానిసలుగా చూస్తున్నారన్నారు. అనేక ఏళ్లగా ఎదురు చూస్తున్న సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో హెల్త్‌ కార్యదర్శులకు అన్యాయం జరిగిందన్నారు. మ్యూచువల్‌ ఆప్షన్‌ ఒకటే ఇవ్వడం కారణంగా హెల్త్‌ కార్య దర్శులకు ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. కార్యక్రమంలో రైల్వేకోడూరు నియోజకవర్గ కార్యదర్శి గంగాధర్‌, ఉమామహేశ్వరి, హైమావతి, లక్ష్మీదేవి, కృష్ణవేణి, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-31T23:19:19+05:30 IST