చేనేత వసా్త్రల వినియోగాన్ని వ్యాప్తి చేయాలి

ABN , First Publish Date - 2023-08-08T00:00:15+05:30 IST

ప్రతి ఒక్కరూ చేనేత వసా్త్రలు ధరించాలని, వినియోగంపై వి స్తృత ప్రచారం నిర్వహించాలని వైవీయూ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.రఘునాథరెడ్డి అ న్నారు.

చేనేత వసా్త్రల వినియోగాన్ని వ్యాప్తి చేయాలి

వైవీయూ ప్రిన్సిపాల్‌ రఘునాథరెడ్డి

కడప (ఎడ్యుకేషన్‌), ఆగస్టు 7: ప్రతి ఒక్కరూ చేనేత వసా్త్రలు ధరించాలని, వినియోగంపై వి స్తృత ప్రచారం నిర్వహించాలని వైవీయూ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.రఘునాథరెడ్డి అ న్నారు. భారత ప్రభుత్వ జాతీయ చేనేత వస్త్ర దినోతక్షౌవ సందర్భంగా చేనేత వసా్త్రలు, వినియోగంపై ఎన్‌ఎ్‌సఎస్‌ యూనిట్‌ -9 పీవో డాక్టర్‌ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కంప్యూటరు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికుల ఆ త్మహత్యలు వారించుటకు భారత ప్రభుత్వం జాతీయ చేనేత వస్త్ర దినోత్సవంగా నిర్వహిస్తుందన్నారు. చేనేత వసా్త్రలు దరించి నేతన్న జీవితాల్లోవెలుగులు నింపవచ్చన్నారు. మరో ముఖ్యఅతిధి ఎన్‌ఎ్‌సఎస్‌ యూనివర్సిటీ సమన్వయకర్త డాక్టర్‌ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ చేనేత దినోత్సవం విధిగా యూనివర్సిటీలో నిర్వహించుకోవాలని అన్నారు. అనంతరం విద్యార్థులు చేనేత వసా్త్రలతో ర్యాంప్‌ వాక్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్‌ రెడ్డయ్య, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-08T00:00:15+05:30 IST