ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Dec 28 , 2023 | 12:21 AM
ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికులకు రావాల్సిన బకా యిలు వెంటనే చెల్లాంచాలని ఏపీ ఐక్య ఉపా ధ్యాయ ఫెడరేషన నాయకులు డిమాండ్ చేశా రు.
మదనపల్లె అర్బన, డిసెంబరు 27: ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికులకు రావాల్సిన బకా యిలు వెంటనే చెల్లాంచాలని ఏపీ ఐక్య ఉపా ధ్యాయ ఫెడరేషన నాయకులు డిమాండ్ చేశా రు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాల యం ఎదుట యూటీఎఫ్ నాయకులు సమస్యల పరిష్కారం కోసం నిరసన చేపట్టారు. ఈ సంద ర్భంగా జిల్లాకార్యదర్శి పురంవెంకటరమణ మాట్లాడుతూ యూటీఎఫ్ రాష్ట్రశాఖ పిలుపు మేరకు ప్రతి డివిజనలో యుటీ ఎఫ్ పోరుబాట కార్యక్రమంలో భాగంగా మదనపల్లెలో నాయకులు నిరసన తెలిపారన్నా 18 వేలకోట్లు పైగా ఉద్యోగులకు బకాయిలు చెల్లించవ లసి ఉందని వెంటనే వాటిని చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని పోరుబాట చేపట్టామ న్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ గౌరవాధ్యక్షుడు సుధాకర్‌నాయుడు, భాస్కర్‌రెడ్డి, ఆది నారాయణ, డివిజన కన్వీనర్ సుధాకర్, రూరల్ అధ్యక్షుడు గాలిరవీంద్ర, ప్రధానకార్యదర్శి మల్లేశ్వరబాబు, డివిజన నాయకులు విజయకుమార్, శైలేష్, అంజాద్, గంగులప్ప, సురేంద్ర, వెంకటయ్య, పాల్గొన్నారు.
పీలేరులో: రాష్ట్ర ప్రభుత్వం బకాయి లను వెంటనే చెల్లించాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయు లు బుధవారం పీలేరు తహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా పలువురు నా యకులు మాట్లాడుతూ పీఎఫ్, ఏపీజీ ఎల్‌ఐ, పీఆర్‌సీ-డీఏ అరియర్స్, సరెండర్ లీవుల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లిం చాలన్నారు. ఉద్యోగులకు ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు చెల్లించాలని స్పష్టమైన నిబం ధనలు ఉన్నా గత రెండేళ్లుగా 15వ తేదీ వరకు కూడా జీతాలు రావడం లేదన్నారు. కార్య క్రమంలో యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు శివారెడ్డి, కోశాధికారి చంద్రశేఖర్, నాయకులు విశ్వనాథరెడ్డి, రాధాకృష్ణ, ఈశ్వర్ మహేంద్ర, సుధాకర్, వేణుగోపాల్, చెంగా రెడ్డి, మస్తాన, కృష్ణమూర్తి, కామేశ్వర, రెడ్డప్ప, పుల్లయ్య, ఆదినారాయణ, రహంతుల్లా, రఫీ పాల్గొన్నారు.