అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Dec 30 , 2023 | 11:54 PM
అంగన్వాడీల న్యాయమైన సమస్యలు తక్షణం పరిష్కరించాలని అంత వరకు నిరవదిక సమ్మె తప్పదని సీఐ టీయూ నాయకులు స్పష్టంచేశారు.
మదనపల్లె టౌన, డిసెంబరు 30: అంగన్వాడీల న్యాయమైన సమస్యలు తక్షణం పరిష్కరించాలని అంత వరకు నిరవదిక సమ్మె తప్పదని సీఐ టీయూ నాయకులు స్పష్టంచేశారు. శనివారం స్థానిక ఐసీడీఎస్ కార్యా లయం ఎదుట అంగన్వాడీలు 19వ రోజు సమ్మెలో పాల్గొన్నారు. వారికి మద్దతుగా సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు మాట్లాడుతూ చిరుద్యోగులైన అంగన్వాడీలపై సీఎం జగన పెత్తందారితనంతో వ్యవరి స్తున్నారన్నారు. నిరంతరం చిన్నారుల పట్ల ఓపికగా సేవలిందించే అం గన్వాడీలు గొంతెమ్మ కోరికలు కోరలేదన్నారు. నిరవదిక సమ్మె వచ్చేనెల 3 నుంచి మరింత ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకురాళ్లు మధురవాణి, గంగాదేవి, సుజన, గీత పాల్గొన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో విన్నపాలు
అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలంటూ శని వారం మదనపల్లె రూరల్, అర్బన సచివాలయాల్లో అంగన్వాడీలు విన తి పత్రాలు అందజేశారు. తాము చిత్తశుద్ధితో పనిచేస్తుంటే ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తోందన్నారు. తాము పడిన కష్టాలను ఇప్పు డు సచివాలయ ఎంఎస్‌కేలు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు.
కళ్లకు గంతలు కట్టుకొని వినూత్న నిరసన
బి.కొత్తకోట డిసెంబర్ 30 : బి.కొత్తకోట ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాల యం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు శనివారం 19వ రోజు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని, అంగన్వాడీల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని, కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నినాదాలు చేశారు. ఈ సందర్బంగా అంగన్వాడీ ప్రాజెక్టు యూనియన నాయకులు శ్రీవాణి, కుమారిలు మాట్లాడుతూ ఓ శాఖ ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తుంటే వారి సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి, మరో శాఖ ఉద్యోగులను వాడుకొని సమ్మెను అణిచివేయాలని చూడడం ఎంత వరకు సమంజసమన్నారు. అంగ న్వాడీ కేంద్రాల తాళాలను పగుల కొట్టించి సచివాలయ ఉద్యోగుల చేత కేంద్రాలను నడపాలని చూడడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక మెట్టు దిగితే మా యూనియన్లు నాలుగు మెట్లు దిగడా నికి సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో పీటీఎం, బి.కొత్తకోట, ముల కలచెరువు మండలాలకు చెందిన అంగన్వాడీలు పాల్గొన్నారు.
తంబళ్లపలెలో: తమ సమస్యల పరి ష్కారానికై అంగన్వాడీలు శనివారం పోస్టు కార్డులతో నిరసన తెలిపారు. అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం 19వ రోజు కొనసా గింది. తంబళ్లపల్లె ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని తంబళ్లపల్లె, పెద్దమండ్యం, కురబలకోట మండ లాల అంగన్వాడీ లు ఐసీడీఎస్ కార్యాలయానికి సమీ పంలోని అంగన్వా డీ కేంద్రం వద్ద టెంట్ వేసుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని నినాదాలు చేశారు. తమ సమస్యలను పోస్టుకా ర్డులపై రాసి సీఎంకు పంపించారు. అనంతరం సమ్మె చేస్తు న్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని సచివాలయాల్లో వినతి పత్రా లు అందచే శారు. కార్యక్ర మంలో అంగన్వాడీ యూనియన నాయకు రాళ్లు కరుణశ్రీ, సులోచన, స్వరూపారాణి, ఉమాదేవి, గౌరి, శివమ్మ పాల్గొన్నారు.
వాల్మీకిపురంలో: కనీస వేతనాలు తదితర డిమాండ్లు పరిష్కరించే దాకా ఉద్యమం ఆపే ప్రసక్తే లేదని అంగన్వాడీ కార్యకర్తలు తేల్చి చెప్పారు. శనివారం వాల్మీకిపురంలో అంగన్వాడీలు గ్రామ సచివాలయా న్ని ముట్టడించి నినాదాలు చేశారు. శ్రమకు తగిన వేతనాలు ఇవ్వాలని కోరుతున్నా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి స్థానిక తహసీల్దార్ ఫిరోజ్‌ఖానకు వినతిపత్రం అందజేశా రు. ఈకార్యక్రమంలో సీఐటీయూ అనుబంధ అంగనవాడీ యూనియన లీడర్లు చంద్రావతి, భూకైలేశ్వరి, ప్రసన్న, అమ్మాజీ, గులాబ్‌జాన, నజీమున్నీసా, లక్ష్మీప్రసన్న, నరసమ్మ, జయప్రద, సూర్యకళ, దేవసేన, రెడ్డిరాణి, కలికిరి, గుర్రంకొండ, వాల్మీకిపురం మండలాల అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు.