అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2023-05-31T23:37:34+05:30 IST

అంగన్వాడీ సమస్యలను పరిష్కంచాలని, టీచర్లను యథాస్థానంలో కొనసాగించాలని సీఐటీయూ నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రారెడ్డి, పి.వెంకటసుబ్బయ్య డిమాండ్‌ చేశారు.

అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలి

కడప (సెవెన్‌రోడ్స్‌), మే 31 : అంగన్వాడీ సమస్యలను పరిష్కంచాలని, టీచర్లను యథాస్థానంలో కొనసాగించాలని సీఐటీయూ నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రారెడ్డి, పి.వెంకటసుబ్బయ్య డిమాండ్‌ చేశారు. స్థానిక పాత బస్టాండులోని సీఐటీయూ ఆఫీసులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పి.చంద్రారెడ్డి, వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ నగరంలో 186 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని, ఈ కేంద్రాల్లో సక్రమంగా గ్యాస్‌ సిలిండర్లు లేవని, అంగన్వాడీ కార్యకర్తలు సొంత డబ్బుతోనే వాటిని సమకూర్చుకుని విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఎప్పుడో కుక్కర్లు ఇచ్చారని, ఇప్పటి వరకు కొత్త కుక్కర్లు ఇవ్వలేదన్నారు. కుక్కర్లు పాడైనప్పుడు వాటిని రిపేరు ఖర్చు కూడా అంగన్వాడీ కార్యకర్తలే భరిస్తున్నారన్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అంగన్వాకీ కార్యకర్తల సమస్యలను తీర్చాలని, లేదంటే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

Updated Date - 2023-05-31T23:37:34+05:30 IST