అంగన్వాడీల ఉద్యమం ఉధృతం
ABN , Publish Date - Dec 28 , 2023 | 12:16 AM
అంగన్వాడీల ఉద్యమం రోజు రోజుకు ఉధృతంగా మారుతోంది. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేదిలేదంటూ అంగన్వాడీలు చేపట్టిన నిరవదిక సమ్మె బుధవారం 15వ రోజుకు చేరింది.
ఫ మదనపల్లెలో ఎమ్మెల్యే ఇంటికి డిమాండ్లను అతికించిన అంగన్వాడీలుఫ సమ్మెకు మద్దతిచ్చిన టీడీపీ నేత శ్రీరామ్‌చినబాబు
ఫతంబళ్లపల్లెలో ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట నిరసన, వినతిపత్రం అందజేతఫ వాల్మీకిపురంలో దున్నకు వినతిపత్రంతో నిరసన
మదనపల్లె టౌన, డిసెంబరు 27: అంగన్వాడీల ఉద్యమం రోజు రోజుకు ఉధృతంగా మారుతోంది. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేదిలేదంటూ అంగన్వాడీలు చేపట్టిన నిరవదిక సమ్మె బుధవారం 15వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా మదనప ల్లెలో అంగన్వాడీలు ఎమ్మెల్యే నవాజ్‌బాషా ఇంటి వద్ద నిరసన తెలి పారు. అంతకు ముందు స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ ప్రభు త్వం తమ డిమాండ్లను పరిష్కరిస్తామని బూటకపు మాటలు మాట్లా డుతూ మభ్యపెడుతున్నారన్నారు. అంగన్వాడీలకు గౌరవ వేతనం కాకుండా, కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమ్మెకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో జగన చెవులుండీ మూగనోముతో అంగన్వాడీల ఓపికను పరీక్షిస్తున్నా రని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల సమస్యలు తీర్చడంతో పాటు వారి డిమాండ్లపై చంద్రబాబు సాను కూలంగా స్పందిస్తారన్నారు. అనంతరం అంగన్వాడీలు ఐసీడీఎస్ కార్యాలయం నుంచి ర్యాలీగా స్థానిక సీటీఎం రోడ్డులోని ఎమ్మెల్యే నవాజ్‌బాషా ఇంటి వద్దకు చేరుకుని ఎమ్మెల్యే ఇంట్లో లేకపోవడంతో ఆయన ఇంటి గోడకు డిమాండ్ల నోటీసును అతికించారు. ఈ కార్యక్ర మంలో మఽధురవాణి, గంగాదేవి, రాజేశ్వరి, గీత, అఖీరున్నీసా, సీపీఎం నాయకుడు హరీంద్రశర్మ తదితరులు పాల్గొన్నారు.
తంబళ్లపల్లెలో:తంబళ్లపల్లె ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని తంబళ్లప ల్లె, పెద్దమండ్యం, కురబలకోట మండలాల అంగన్వాడీలు మదనపల్లె లోని తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి కార్యాలయం వద్దకు చేరు కుని నిరసన తెలిపారు. తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరిం చాలని నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డికి వినతి పత్రం అందించి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన నాయకురాళ్లు కరుణశ్రీ, సులోచన, సరస్వతీ, స్వరూపా రాణి, ఉమాదేవి, గౌరి, శివమ్మ, సుజాత అంగన్వాడీలు పాల్గొన్నారు.
బి.కొత్తకోటలో: తమ డిమాండ్ల సాధన కోసం బి.కొత్తకోట అంగన్వా డీ వర్కర్లు బుధవారం మదనపల్లెలోని తంబళ్లపల్లె ఎమ్యెల్యే ద్వారక నాథ్‌రెడ్డి కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సుమా రు గంటపాటు ధర్నా చేసి ఎమ్యెల్యేకు వినతి పత్రాన్ని అందజేశారు. తమ డిమాండ్లను పరిష్కరించేలా ప్రయత్నించాలని ప్రాజెక్టు యూని యన లీడర్లు శ్రీవాణి, కుమారి తదితరులు ఎమ్యెల్యేను కోరారు. ఈ సందర్బంగా ఎమ్యెల్యే మాట్లాడుతూ అయితే ఇది రాష్ట్ర వ్యాప్త సమస్య అని, లోటు బడ్చెట్ కారణంగా దీనిపై ప్రభుత్వం ఆలోచి స్తోందన్నారు. మీ వినతిని గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతా నని హామీ ఇచ్చినట్లు అంగన్వాడీ లీడర్లు పేర్కొన్నారు. ప్రభుత్వం మా డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామన్నారు.
వాల్మీకిపురంలో: కనీస వేతనాల విషయమై సామరస్యంగా సమ్మె చేస్తున్నా ఈ ప్రభుత్వానికి మాత్రం దున్నపోతు మీద వర్షం కురిసిన ట్లు త యారైందని అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం వాల్మీకిపురంలో అంగన్వాడీలు వినూత్న రీతిలో దున్నపో తుకు వినతిపత్రం అందజేసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీల వేతనాలు, తదితర డిమాండ్ల విషయంలో చర్చలకు పిలిచి మళ్లీ మాయ మాటలు చెప్పి మభ్యపెట్టడం ఇక సహించేది లేదన్నారు. ఆందోళనలు మరింత ఉధృతం చేసి ప్రభుత్వా నికి తమ సత్తా ఏంటో చూపుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ అనుబంధ అంగన్వాడీ యూనియన లీడర్లు చంద్రావతి, భూకైలేశ్వరి, అమ్మాజీ, ప్రసన్న, గులాబ్‌జాన, నజీమున్నీసా, లక్ష్మీప్రస న్న, దేవసేన, జయప్రద, నరసమ్మ, సూర్యకళ, రెడ్డిరాణి, వాల్మీకిపురం, గుర్రంకొండ, కలికిరి అంగన్వాడీలు పాల్గొన్నారు.