అరాచక పాలనకు అంతిమ ఘడియలు!

ABN , First Publish Date - 2023-03-25T22:00:27+05:30 IST

ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న జగన ప్రభుత్వానికి అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయని మాజీ ఎమ్మెల్యే, రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి రమేశకుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు.

అరాచక పాలనకు అంతిమ ఘడియలు!
తూముకుంటలో ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రమేశరెడ్డి

వైసీపీ ఎమ్మెల్యేలే చీదరించుకుంటున్నారు

ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ ఘనవిజయం

‘ఇదేం ఖర్మ’ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రమేశరెడ్డి

గాలివీడు, మార్చి 25: ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న జగన ప్రభుత్వానికి అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయని మాజీ ఎమ్మెల్యే, రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి రమేశకుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు. ఆయన శనివారం తూముకుంట పంచాయతీలో ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్య క్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లోని అరాచక ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారని, వీరి విజయంలో పట్ట భద్రుల కృషి మరువలేనిదన్నారు. జగన ప్రభుత్వంపై ప్రజలకే కాక, వారి సొంత ఎమ్మెల్యేలు సైతం విశ్వాసం కోల్పోయారని తెలిపారు. జగన ప్రభు త్వంలో అన్ని వర్గాల వారు అన్యాయానికి గురవుతున్నారని, ప్రభు త్వాన్ని ప్రశ్నించే వారిపై అన్యాయంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నా రని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వెలిగల్లు ప్రాజెక్టులో తక్కువ నీళ్లు ఉన్నా ఆయకట్టుకు విడుదల చేసి రైతాంగాన్నిఆదుకున్నా మని తెలిపారు. మూడేళ్లుగా ప్రాజెక్టు నిండా నీరున్నా ఒక ఎకరా ఆయక ట్టుకు కూడా నీటిని అందించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నదని ఎద్దేవా చేశారు. ప్రస్తుత పాలకులకు కమిషన్లపైనే తప్ప అభివృద్ధిపైన దృష్టి లేదని విమర్శించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకట నారాయణరెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు లక్ష్మయ్య, మండల టీడీపీ ఉపాధ్యక్షుడు శివప్పనాయుడు, క్లస్టర్‌ ఇనచార్జి సత్యారెడ్డి, మాజీ సర్పంచ భద్రప్పనాయుడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు శేషారెడ్డి, టీడీపీ నాయకులు కదిరిరెడ్డినాయుడు, రమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T22:00:27+05:30 IST