వైసీపీ ప్రభుత్వ పతనానికి నాంది

ABN , First Publish Date - 2023-03-19T00:34:29+05:30 IST

రాష్ట్రంలో జరిగిన మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా ప్రజలు వైసీపీ ప్రభుత్వ పతనానికి నాంది పలికారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌. శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

వైసీపీ ప్రభుత్వ పతనానికి నాంది
మీడియాతో మాట్లాడుతున్న పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి

మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టమైన ప్రజాతీర్పు

నైతిక బాధ్యత వహించి అసెంబ్లీ రద్దు చేయాలి

పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి

అనంతపురం క్లాక్‌టవర్‌, మార్చి 18: రాష్ట్రంలో జరిగిన మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా ప్రజలు వైసీపీ ప్రభుత్వ పతనానికి నాంది పలికారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌. శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలం నరసానాయుడుతో కలిసి అనంతపురంలోని జేఎన్‌టీయూలో మీడియాతో మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం ఆశ్చర్యంగా లేదని, తమ పార్టీ ముందే ఊహించిందని తెలిపారు. నాలుగు ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సీఎం జగన్‌ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే శాసనసభనురద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. సొంత చిన్నాన్నను చంపిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్‌రెడ్డిని కాపాడేందుకు సీఎం జగన్‌ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడని విమర్శించారు.

అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన వైసీపీ ప్రభుత్వం ఎన్నికలను ప్రహసనంగా మార్చిందని ఆరోపించారు. కౌంటింగ్‌ కేంద్రంలోకి వైసీపీ గూండాలు ఫేక్‌ ఐడీలతో ప్రవేశించి టీడీపీ ఏజెంట్లపై దాడి చేయడం దుర్మార్గమన్నారు. ప్రజలలో మార్పు వచ్చిందనేందుకు ప్రస్తుతం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్‌ వద్దని మళ్లీ చంద్ర బాబునాయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరు కుంటున్నారని ఈ ఎన్నికలు స్పష్టమైన సంకేతాలు ఇవ్వడం శుభపరిణామమన్నారు.

Updated Date - 2023-03-19T00:34:29+05:30 IST