భవ్య శ్రీ ఘటనలో నిందితులను శిక్షించాలి
ABN , First Publish Date - 2023-09-26T22:38:21+05:30 IST
ఇంటర్ విద్యార్థిని భవ్య శ్రీ ఘటన లో నిందితులను కఠినంగా శిక్షించాలని రైల్వేకోడూరు వడ్డెర సంఘం ఐక్య వేదిక నేతలు డిమాండ్ చేశారు.
వడ్డెర సంఘం ఐక్య వేదిక డిమాండ్
రైల్వేకోడూరు(రూరల్) సెప్టెంబరు 26: ఇంటర్ విద్యార్థిని భవ్య శ్రీ ఘటన లో నిందితులను కఠినంగా శిక్షించాలని రైల్వేకోడూరు వడ్డెర సంఘం ఐక్య వేదిక నేతలు డిమాండ్ చేశారు. స్థానిక జ్యోతిరావు పూలే విగ్రహ వద్ద నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ఎన్‌ఆర్‌ఐ వడ్డెర సంఘం అధ్యక్షులు బత్తల లక్ష్మయ్య ఆధ్వర్యంలో కొవొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమం లో రాష్ట్ర అధ్యక్షులు వడ్డే రమణ, మండల అఽధ్యక్షులు బి.సుబ్రహ్మణ్యం, విజ య్, సిద్దేశ్వర, రామక్రిష్ణ, మల్లికార్జున, బాపుజీ, జయకార్ పాల్గొన్నారు.