గెలుపు గుర్రాలకే టీడీపీ టికెట్టు
ABN , Publish Date - Dec 23 , 2023 | 11:20 PM
గెలుపు గుర్రాలకే టిక్కెట్టు వస్తుందని, ప్రొద్దుటూరు టీడీ పీ టిక్కెట్టు ఎవరికొస్తుందో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ఎలా చెప్పగలడని, అంతేకాకుం డా బెట్టింగులు పెట్టడం మంచి సంస్కృతి కాదని మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తనయుడు, టీడీపీ యువనేత నంద్యాల కొండారెడ్డి హితవు పలికారు.
ఎవరికొస్తుందో రాచమల్లు చెప్పడమేమిటి !
బెట్టింగులు మంచి సంస్కృతికాదు : నంద్యాల కొండారెడ్డి
ప్రొద్దుటూరు, డిసెంబరు 23: గెలుపు గుర్రాలకే టిక్కెట్టు వస్తుందని, ప్రొద్దుటూరు టీడీ పీ టిక్కెట్టు ఎవరికొస్తుందో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ఎలా చెప్పగలడని, అంతేకాకుం డా బెట్టింగులు పెట్టడం మంచి సంస్కృతి కాదని మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తనయుడు, టీడీపీ యువనేత నంద్యాల కొండారెడ్డి హితవు పలికారు. శనివారం స్ధానిక నెహ్రూరోడ్డులోని టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రొద్దుటూ రు టీడీపీ టికెట్టును ఎందరైనా ఆశించవచ్చని అందులో ప్రజామద్దతు, గెలుపు అవకాశాలున్న వారికే అధిష్టానం టిక్కెట్టు కేటాయిస్తుందన్నారు. ప్రొద్దుటూరులో టీడీపీ జెండా ఎగురవేయడం, ముఖ్యమంత్రిగా చంద్రబాబును పీఠంపై కూర్చోబెట్టడమే ధ్యేయమన్నారు. టీడీపీలో ఎవరెవరికి టికెట్టు వస్తుందనే విషయమై లెక్క చెప్పే ఎమ్మె ల్యే రాచమల్లు తనకు ఈ సారీ టికెట్టు, గెలుపుపై ఎంతశాతం ప్రజా మద్దతు వుందో కూడా చూసుకుంటే మంచిదన్నారు.
జగన్ గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించానని అహంకారానికి పోయారన్నారు. వచ్చేఎన్నికల్లో టీడీపీకి అంతకంటే ఎక్కువ సీట్లు సాధించి జగన్ పాలనను అంతం చేసి తీరుతామన్నారు. 2024లో చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవలందిస్తారన్నారు. టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు ఘంటశాల వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట కొండయ్య, వక్ఫ్‌బోర్డు డైరెక్టర్ నిమ్మకాయల మున్నా, న్యాయవాది గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.