చంద్రబాబు, లోకేశలకు టీడీపీ నేతల శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2023-01-15T00:07:42+05:30 IST

సంక్రాంతి సందర్భంగా తిరుపతి జిల్లా నారావారిపల్లెకు చేరుకున్న టీడీపీ అధినే త చంద్రబాబునాయుడుకు మదనపల్లె టీడీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

చంద్రబాబు, లోకేశలకు టీడీపీ నేతల శుభాకాంక్షలు
చంద్రబాబునాయుడుతో జయరామనాయుడు

మదనపల్లె టౌన, జనవరి 14: సంక్రాంతి సందర్భంగా తిరుపతి జిల్లా నారావారిపల్లెకు చేరుకున్న టీడీపీ అధినే త చంద్రబాబునాయుడుకు మదనపల్లె టీడీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు, మదనపల్లె టీడీపీ నేత జయరామనాయుడు, రాజంపేట పార్లమెం ట్‌ అధికార ప్రతినిధి ఆర్‌జే వెంకటేశ విడివిడిగా చంద్ర బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే టీడీపీ జాతీ య ప్రధాన కార్య దర్శి నారా లోకేశ, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణలను కలసి శుభాకాంక్షలు తెలి పారు.

కురబలకోటలో: టీడీపీ అధినేత చంద్రబా బునాయుడు, పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశలను తంబళ్ళపల్లె నియోజకవ ర్గానికి చెందిన తెలుగు దేశం పార్టీ నాయకు లు శనివారం కలిశారు. చంద్రబాబు స్వగ్రా మమైన నారావారిపల్లెలో సంక్రాంతి వేడు కలకు హాజరైన సందర్భంగా రాజంపేట పార్లమెంటరీ బీసీ సెల్‌ అధ్యక్షుడు పి.సురేం ద్రయాఙదవ్‌, టీడీపీ నేత రాష్ట్రకార్యనిర్వాహక కార్యదర్శి పర్వీనతాజ్‌, మాజీ వైస్‌ ఎం పీపీ వెంకటరమణారెడ్డి, గుత్తికొండ త్యాగరాజు, శంకర్‌రెడ్డి, సదాశివలు కలిసి నియో జకవర్గంలో జరుగుతున్న రాజకీయపరిస్థితులను తెలియజేశారు. అలాగే ఈ నెల 27నుంచి కుప్పం నుంచి ప్రారంభం కానున్న ‘యువగ ళం పాదయాత్ర’ విజయవం తానికి కృషి చేయాలని యువనేత లోకేశ ఆదేశించారు.

రామసముద్రంలో: సంక్రాంతి పండుగ సందర్భంగా నారావారిపల్లెకు విచ్చేసిన టీడీ పీ అధినేత చంద్రబాబునాయుడును రామస ముత్రం మండల టీడీపీ నేతలు శని వారం కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజే శారు. రాబోయే ఎన్నికలలో టీడీపీ అధికారం లోకి రావడం ఖాయమన్నారు. చంద్రబాబును కలిసిన వారిలో మాజీ జడ్పీటీసీ శివశంకర్‌, నేతలు కృష్ణంరాజు, అయ్యప్ప, డాక్టర్‌ శివ, వాహిద్‌ ఉన్నారు.

Updated Date - 2023-01-15T00:07:43+05:30 IST