ఆక్రమణలకు తొలగింపునకు సర్వే

ABN , First Publish Date - 2023-06-02T23:18:36+05:30 IST

పుల్లం పేటలోని చిట్వేలి రోడ్డులో ఆక్రమణల తొలగింపునకు తహసీల్దారు నరసింహ కు మార్‌ అధ్వర్యంలో శుక్రవారం రెవెన్యూ అధికారులు సర్వే చేశారు.

ఆక్రమణలకు తొలగింపునకు సర్వే
ఆక్రమణలపై వివరిస్తున్న తహసీల్దారు

పుల్లంపేట, జూన్‌2 : పుల్లం పేటలోని చిట్వేలి రోడ్డులో ఆక్రమణల తొలగింపునకు తహసీల్దారు నరసింహ కు మార్‌ అధ్వర్యంలో శుక్రవారం రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. రోడ్డు విస్తరణలో భాగంగా పుల్లం పేట నుంచి చిట్వేలి వెళ్లే మార్గంలో ఆక్ర మణల తొలగింపున కు అధి కారులు ఇదివరకే నోటీసులు అందజేశారు. ఈ రహదారిలో ఆర్‌ అండ్‌ బీ స్థలం 10 మీటర్లు పైగా ఉండగా, ఆక్రమణల కారణంగా ప్రస్తుతం 7 మీటర్లు కూడా లేదని అధికారులు అంటున్నారు. మార్కింగ్‌ ఇచ్చి వారం లోపు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించాలని, లేని పక్షంలో తామే ఆక్రమణలు తొలగిస్తామని తహసీల్దారు సూచించారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న భవనాలు పడగొడతాననడం న్యాయం కాదని ఆక్రమణ దారులు తహసీల్దారుకు విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ నవీన్‌, వీఆర్వో సోమశేఖర్‌రెడ్డి, ముజీజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T23:19:02+05:30 IST