విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలి

ABN , First Publish Date - 2023-03-30T23:35:55+05:30 IST

పిల్లలకు ఆస్తులు ఇచ్చేదానికంటే మంచి విద్యనిచ్చేందుకు తల్లిదండ్రులు కృషి చేసి తమ పిల్లను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని కడప ఉప విద్యాధికారి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.

విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలి
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఉపవిద్యాధికారి రాజగోపాల్‌రెడ్డి

కడప (ఎడ్యుకేషన్‌), మార్చి 30 : పిల్లలకు ఆస్తులు ఇచ్చేదానికంటే మంచి విద్యనిచ్చేందుకు తల్లిదండ్రులు కృషి చేసి తమ పిల్లను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని కడప ఉప విద్యాధికారి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. కడప నగరం పవన్‌ ఇంగ్లీషు మీడియం హైస్కూలులో పదో తరగతి విద్యార్థులకు ఫేర్వెల్‌డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో తమ పిల్లలకు ఆస్తులు, భూమి ఇవ్వడంలో పోటీ పడకుండా నైతిక విలువలతో కూడిన మంచి విద్యనందించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. విద్య విలువ తెలిసిన విద్యావేత్త లెక్కల జోగిరామిరెడ్డి ననిబద్దత, అకుంఠిదీక్షతో విద్యా సంస్థ నడుపుతూ నైతిక విలువలతో కూడిన ఉత్తమవిద్యతో పాటు క్రీడలు, పోటీ పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థులను అణిముత్యాలుగా తీర్చిదిద్దుతున్నారన్నారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్‌ జోగిరామిరెడ్డి మాట్లాడుతూ 50 మంది విద్యార్థుల తో పాఠశాల స్థాపించి అక్కాయపల్లె ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సహకారంతో ఉన్నత ప్రమాణాలతో విద్యా సంస్థ నిర్వహిస్తూ విద్యార్థులనుతీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రముఖ ఆర్దోపెడిక్‌ వైద్యులు డాక ్టర్‌ విద్యాసాగర్‌రెడ్డి ప్రసంగించారు.

Updated Date - 2023-03-30T23:35:55+05:30 IST