Share News

బకాయిల చెల్లింపు కోసం పోరుబాట

ABN , Publish Date - Dec 26 , 2023 | 11:13 PM

ఉద్యోగ ఉపాధ్యాయులకు రావలసిన బకాయిలు తక్షణమే చెల్లించాలని కోరుతూ విజయవాడలో జనవరి 9, 10తేదీల్లో 36గంటల ధర్నా చేపడుతున్నామని యూటీ ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజా, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్‌, పాలెం మహేశ్‌బాబు తెలిపారు.

బకాయిల చెల్లింపు కోసం పోరుబాట
సమావేశంలో మాట్లాడుతున్న యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజా

యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజా

కడప (ఎర్రముక్కపల్లె), డిసెంబరు 26: ఉద్యోగ ఉపాధ్యాయులకు రావలసిన బకాయిలు తక్షణమే చెల్లించాలని కోరుతూ విజయవాడలో జనవరి 9, 10తేదీల్లో 36గంటల ధర్నా చేపడుతున్నామని యూటీ ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజా, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్‌, పాలెం మహేశ్‌బాబు తెలిపారు. మంగళవారం యూటీఎఫ్‌ భవనంలో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాలసిన సుమారు రూ.18వేల కోట్లు బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. ఆగస్టులో ఉద్యోగులతో జరిగిన జా యింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో సెప్టెంబరులోపు అన్ని బకాయిలు చెల్లిస్తామని మంత్రులు అధికారులు ఇచ్చిన హామీ ఇంత వరకూ నెరవేరలేదని విమర్శించారు. బకాయిల కోసం ఎప్పుడు ఆందోళన చేసినా తరువాత నెలలో ఇస్తామని చెప్పడం తప్ప ఆచరణలో మాత్రం పురోగతిలేదన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలను ఇలా వాయిదాల మీద వాయిదాలు వేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త మ అవసరాల కోసం దాచుకున్న పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ సొమ్ము, డీఏ పీఆర్సీ ఆర్జిత సెలవుల బకాయిల చెల్లింపుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు.

ఒక పక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని ప్రకటిస్తూనే మరో పక్క ఉద్యోగుల కు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడం తగదన్నారు. ఆర్థిక బకాయిల చెల్లింపులో అలసత్వం ప్రదర్శించడాన్ని నిరసిస్తూ బకాయి లు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ 27న అన్నితాలుకా కేంద్రా ల్లో ఆరుగంటల ధర్నా జనవరి 3న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట 12 గంటల ధర్నా జనవరి 9, 10తేదీల్లో 36గంటల ధర్నా విజయవాడలో చేపడుతున్నామని స్ప ష్టం చేశారు. పాత పెన్షన్‌ను పునరుద్దరించాలని డిమాండ్‌ చేస్తూ ఓట్‌ ఫర్‌ ఓపీఎస్‌ పిలుపును విస్తృతంగా ప్రచారం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్‌, కడప జిల్లా నేతలు నరసింహారావు, రమణ, ఎజాజ్‌ అహ్మద్‌, చెంగల్‌రాజు, ఎం.ప్రభాకర్‌, బాబు, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 11:13 PM