Share News

డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె

ABN , Publish Date - Dec 28 , 2023 | 10:47 PM

మావి న్యాయమైన డిమాండ్లు..మీకు ఎంతగా అరచి చెప్పినా వినడపడటం లేదు..అందుకే డిమాండ్ల లేఖలు రాస్తున్నాం..అందుకోండి సార్‌ అంటూ అంగన్వాడీలు నినదించారు.

డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె
తంబళ్లపల్లె: నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు

మదనపల్లె టౌన, డిసెంబరు 28: మావి న్యాయమైన డిమాండ్లు..మీకు ఎంతగా అరచి చెప్పినా వినడపడటం లేదు..అందుకే డిమాండ్ల లేఖలు రాస్తున్నాం..అందుకోండి సార్‌ అంటూ అంగన్వాడీలు నినదించారు. గురువారం స్థానిక ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట 17వ రోజు ఆం దోళన కొనసాగించారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లను రాసిన పోస్టు కార్డులను సీఎం జగన చిరునామాకు పోస్టు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం తమపై వివక్ష చూపడం బాధాకరమన్నారు. వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో నిరసనలు తెలు పుతామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని ఉగ్రరూపంలోకి తీసుకెళతామన్నా రు. కార్యక్రమంలో మధురవాణి, గంగాదేవి, గీత, అఖీరున్నీసా, అనసూయ పాల్గొన్నారు.

తంబళ్లపల్లె: తంబళ్లపల్లె ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కా ర్యాలయానికి సమీపంలోని అంగన్వాడీ కేంద్రం వద్ద తంబళ్లపల్లె, పెద్దమండ్యం, కురబలకోట మండలాల అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు టెం టు వేసుకుని నిరసన తెలిపారు. కనీస వేతనం అమలు, ఉద్యోగ భద్రత, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు గ్రాట్యుటీని అమలు చేయాలని డి మాండ్‌ చేశారు. తమ న్యాయపరమైన డిమాం డ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. కార్య క్రమంలో అంగనవాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన నాయకురాళ్లు కరుణశ్రీ, సులోచన, సరస్వతీ, స్వరూపారాణి, ఉమాదేవి, గౌరి, శివమ్మ, సుజాత తదితర అంగన్వాడీ కార్యకర్త లు, హెల్పర్లు పాల్గొన్నారు.

వాల్మీకిపురం: ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట పోస్టుకార్డులతో నిరసన వ్యక్తం చేశారు లీడర్లు చంద్రావతి, భూ కైలేశ్వరి, అమ్మాజీ, ప్రసన్న, గులాబ్‌జాన, నజీ మున్నీసా, లక్ష్మీప్రసన్న, దేవసేన, జయప్రద, నరసమ్మ, సూర్యకళ, రెడ్డిరాణి, వాల్మీకిపురం, కలికిరి, గుర్రంకొండ మండలాల కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2023 | 10:47 PM