అక్రమ వసూళ్లు చేస్తే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2023-09-05T23:55:19+05:30 IST
వెలుగు మహిళా సంఘాలలో అక్రమ వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెలు గు ఏపీఎం సురేష్‌రెడ్డి హెచ్చరించారు.
మదనపల్లె టౌన, సెప్టెంబరు 5: వెలుగు మహిళా సంఘాలలో అక్రమ వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెలు గు ఏపీఎం సురేష్‌రెడ్డి హెచ్చరించారు. స్పందన కార్యక్రమంలో రాఘవేంద్ర గ్రూ పు లీడర్లు, సంఘమిత్ర కలసి గ్రూపు సభ్యుల నుంచి అక్రమంగా నగదు వసూ లు చేశారని ఫిర్యాదు వచ్చిన విషయం తెలి సిందే. ఈ క్రమంలో మంగళవారం పోతబో లు పంచాయతీలో రాఘవేంద్ర గ్రూపు సభ్యులను ఏపీఎం విచారించారు. ఈ గ్రూపులో ఐదుగురు సభ్యులు రూ.1200 చొప్పున లీడర్లకు ఇచ్చారని, అందులో రూ.2వేలు సంఘ మిత్రకు ఇచ్చినట్లు మిగిలిన సొమ్ము లీడర్ల వద్దే ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఏపీ ఎం మాట్లాడుతూ రుణాల మంజూరు, పొదుపు సొమ్ము పడినపుడు, ఇతర సంక్షే మ పథకాలు పడినప్పుడు గ్రూపు లీడర్లు, సంఘమిత్రలు అక్రమ వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సీసీ శ్రీనివాసులు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.