సత్య గంగమ్మకు ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2023-03-05T23:05:13+05:30 IST

పట్టణంలోని బలిజ సంఘం వీధిలో వెలసిన సత్య గంగమ్మకు మహిళలు ప్ర త్యేక పూజలు నిర్వహించారు.

సత్య గంగమ్మకు ప్రత్యేక పూజలు

వేంపల్లె, మార్చి 5: పట్టణంలోని బలిజ సంఘం వీధిలో వెలసిన సత్య గంగమ్మకు మహిళలు ప్ర త్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం మహిళలందరు గంగమ్మకు 101 బిందెల నీటిని పోసి త మ మొక్కును తీర్చుకున్నారు. ముందుగా గంగమ్మ తల్లిని ప్రత్యేక అలంకరించి పూజలు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురిసి రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. ఆటలమ్మ తల్లి, చికెన పాక్స్‌ లాంటి వైర్‌సలు ఎక్కువగా ఉన్నందున గంగమ్మ తల్లి శాంతించి చిన్నారులందరినీ కాపాడాలని కోరామన్నారు.

Updated Date - 2023-03-05T23:05:13+05:30 IST