కోర్టులో గంగమ్మకు విశేషపూజలు

ABN , First Publish Date - 2023-06-02T23:41:24+05:30 IST

కోర్టుల ఆవర ణలో వెలసిన కోర్టులో గంగమ్మకు శుక్రవా రం ఆలయకమిటీ ఆధ్వర్యంలో విశేషపూ జలు నిర్వహించారు.

కోర్టులో గంగమ్మకు విశేషపూజలు

మదనపల్లె అర్బన, జూన 2: కోర్టుల ఆవర ణలో వెలసిన కోర్టులో గంగమ్మకు శుక్రవా రం ఆలయకమిటీ ఆధ్వర్యంలో విశేషపూ జలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం అమ్మవారిని వివిధ పూలతో ప్రత్యే కంగా అలకంరించి, అభిషేకాలు, అర్చనలు, విశేషపూజలు నిర్వహించారు. పూజలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవా రిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం రాహుకాల సమయంలో మహిళలు ఆలయం చేరుకుని పొంగళ్ల నైవేథ్యంగా తీసుకొచ్చి చీరలను అమ్మ వారికి సమర్పించారు. అనంతరం నిమ్మకాలయలపై నెయ్యి ఒత్తులతో దీపారాధన చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీచే శారు. ఈ పూజ కార్యక్రమాలను ఆలయకమిటీ సభ్యులు మార్పురి సుధాకర్‌ నాయుడు, మార్పురి నాగార్జున బాబు(గాంధీ), నీరుగట్టు ఆనందరెడ్డి, చైతన్యకుమార్‌రెడ్డి పర్యవేక్షించారు.

అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ

వాల్మీకిపురం, జూన 2: పట్టణంలో వెలసిన నల్ల వీరగంగా భవాని అమ్మవా రి జాతర మహోత్సవాల సందర్భంగా పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు సురేష్‌, అరుణకుమారి దం పతులు శుక్రవారం అమ్మ వారికి పట్టువస్త్రాలు సమ ర్పించారు. గత కొన్ని సంవ త్సరాలుగా జాతర సందర్భంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమ ర్పిస్తుంటారు. అమ్మవారికి విశేష అలంకరణలు గావించి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అలాగే అఖండ జ్యోతి, ధ్వజారోహణం, పొంగు పాలదేవర, విశేష పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పం పిణీ, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్ర మంలో ఆలయ ధర్మ కర్త నారాయణరెడ్డి ఉత్పవ కమిటీ చైర్మన రామ్‌కు మార్‌రెడ్డి, నారా యణ పూజారి జనార్ధన, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T23:41:24+05:30 IST