చంద్రబాబు కోసం ప్రత్యేక పూజలు
ABN , First Publish Date - 2023-09-21T23:55:35+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబునాయు డు ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే షాజహానబాషా కుమారుడు జునైద్‌అక్బారి పేర్కొన్నారు.
మదనపల్లె టౌన, సెప్టెంబరు 21: టీడీపీ అధినేత చంద్రబాబునాయు డు ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే షాజహానబాషా కుమారుడు జునైద్‌అక్బారి పేర్కొన్నారు. గురువారం స్థానిక బెంగళూరు బస్టాండు వద్ద టీడీపీ కార్యాలయంలో పేదలకు అన్నదానం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 73 ఏళ్ల వయస్సులో కూడా చంద్రబాబు మానసికంగా దృఢంగా ఉంటూ బయట ఉన్న పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారున్నారు. కార్యక్రమంలో టౌన బ్యాంకు మాజీ చైర్మన నాదెళ్ల విద్యాసాగర్, బాలుస్వామి, నాగూర్‌వలి, పూలకుంట్ల హరి, బాలు తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న నిరాహారదీక్షలు
మదనపల్లె టీడీపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు గురువారం ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు ముస్లీం మైనారిటీలు సంఘీభావం తెలుపుతూ దీక్షలో పాల్గొ న్నారు. టీడీపీ ఇనచార్జి దొమ్మలపాటి రమేశ తనయులు యశశ్విరాజ్, చాణుక్య తేజ మాట్లాడుతూ తప్పుడు కేసులు ఎన్నటికి నిలబడవని, హైకోర్టులో చంద్రబాబుకు ఉపశమనం రావడం ఖాయమన్నారు. వైసీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, ప్రజలే ఆ పార్టీకి బుద్ధిచెప్పి గద్దె దించుతారన్నారు. కార్యక్రమంలో టీడీపీ ముస్లీం మైనా రిటీ నాయకులు ఎస్‌ఎం రఫి, నిస్సార్‌అహ్మద్, తాజ్‌బాషా, దాదాపీర్, లతీఫ్, బావాజన, సికిందర్, పట్టణ అధ్యక్షుడు భవానిప్రసాద్, చెక్కా బాబు, రెడ్డిశేఖర్, సుధాకర్, విద్యాసాగర్, విజయమ్మ పాల్గొన్నారు.
ములకలచెరువులో: మండలంలోని దేవళచెరువు సమీపంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం టీడీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే జి.శంకర్‌యాదవ్ ఆదేశాల మేరకు టీడీపీ మండల అధ్యక్షుడు పాలగిరి సిద్ధా ఆధ్వర్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి త్వరగా బెయిల్ వచ్చి ఆరోగ్యం గా ఉండాలని 101 టెంకాయలు కొట్టారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు గుత్తా సుధాకర్‌నాయుడు, రాజంపేట నియోజకవర్గ బీసీ సెల్ అధికార ప్రతినిధి ముత్తుకూరు మౌళా, రాష్ట్ర పాల ఏకరి సాధికార సమితి సభ్యులు జేసీబీ సుధాకర్ నాయుడు, మాజీ వైస్ ఎంపీపీ నరసింహారెడ్డి, దేవళచెరువు, సోంపల్లె, పర్తికోటగ్రామల పార్టీ అధ్యక్షులు బి. శ్రీనివాసులు, ఎం.సుధాకర్ నాయు డు, జయరామ్, యూనిట్ ఇనచార్జి నారాయణస్వామినాయుడు, నాయ కులు చంద్ర, రాము, సుదర్శన, శంకర్‌నారాయణ, షామీర్, నాగమ ల్లప్ప, చలపతి, వెంకటాద్రి, శ్రీనివాసులు, రామదాసు పాల్గొన్నారు.
తంబళ్లపల్లెలో: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షు డు నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగుండాలని, తిరిగి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ, రెడ్డెప్ప దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు త్వరగా క్షేమంగా జైలు నుంచి బయటకు రావాలని, కుటుంబసభ్యులకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని గురువారం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి తంబళ్లపల్లె శివాలయంలో పూజలు చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు రామచంద్ర, మ్యూజికల్ శివ, మల్లికార్జున, వీరాంజినేయులు, మదనమోహన తదితరులు పాల్గొన్నారు.
పోస్టుకార్డులతో టీడీపీ నేతల ఉద్యమం
పెద్దతిప్పసముద్రం సెప్టెంబర్ 21 : టీడీపీ జతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్‌కు నిరసనగా గురువారం బి.కొత్త కోట మండలం బీరంగి గ్రామంలో తెలుగుదేశం నాయకులు పోస్టు కార్డులు రాసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోస్టు చేశారు. ఈసంద ర్భంగా పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చేయని తప్పుకు కక్ష పూరితంగా జైలుకు పంపించిన సీఎం జగనకు వడ్డితో సహా రిటన గిప్టు ఇచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయ న్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమని వారు తెలిపారు. కార్యక్రమంలో యూనిట్ ఇనచార్జ్ గోపి, బీరంగి గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆనంద్, సీనియర్ నాయకులు జైశ్రీరాంరెడ్డి, శ్రీరాములు, కాశిపల్లె నరసింహులు, ఎం. రవి, ఎస్. వెంక టేశ, దేవర వెంకట్రమణ, వేమన్న, ఆర్. వెంకట్రమణ, గుట్టా నారా యణప్ప, వరోళ్లపల్లె శ్రీనా, తదితరులు పాల్గొన్నారు.
బి.కొత్తకోటలో: టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను ఖండించిన టీడీపి నాయకులు ప్రతి ఒక్కరూ ఆయనకు అండగా నిలవాలని కోరారు. మండలంలోని గట్టు గ్రామంలో గురువా రం పార్టీ ముద్రించిన బాబుతో నేను వాల్‌పోస్టర్లను ఇంటింటికి పంపి ణీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ కక్షతో చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించి చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని వారన్నారు. కార్యక్రమంలో యూని ట్ ఇంచార్జ్ మొటుకు శివ, ఎండి. మస్తాన, రెడ్డెన్న, మహబూబ్‌బాష, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు
పెద్దమండెంలో: టీడీపీ జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాజంపేట పార్లమెంటు ఎస్టీ సెల్ అధ్యక్షు డు నటరాజ్ నాయక్ ఆధ్వర్యంలో గురువారం నిరసన చేశారు. బాబు తో నేను ప్లే కార్డులతో నిరసన తెలుపుతూ చంద్రబాబు అక్రమ అరె స్టును ఖండించారు.