రాహుల్‌గాంధీ పీఎం కావాలని విశేషపూజలు

ABN , First Publish Date - 2023-03-18T23:26:45+05:30 IST

రాహుల్‌గాం ధీ ప్రధానమంత్రి కావాలని శనివారం స్థాని క దేవళంవీధిలోని ప్రసన్న వేంకటరమణ స్వామిఆలయంలో కాంగ్రెస్‌పార్టీ నాయకు లు విశేషపూజలు నిర్వహించారు.

రాహుల్‌గాంధీ పీఎం కావాలని విశేషపూజలు
ఆలయంలో 101 టెంకాయలు కొడుతున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు

మదనపల్లె అర్బన, మార్చి18: రాహుల్‌గాం ధీ ప్రధానమంత్రి కావాలని శనివారం స్థాని క దేవళంవీధిలోని ప్రసన్న వేంకటరమణ స్వామిఆలయంలో కాంగ్రెస్‌పార్టీ నాయకు లు విశేషపూజలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా పార్టీ పట్టణ అఽధ్యక్షుడు రెడ్డిసాహె బ్‌, నియోజకవర్గ నాయకుడు వేల్పులశ్రీధర్‌ మాట్లాడుతూ భారతదేశ ప్రధానిగా రాహుల్‌ గాంధీ కావాలని 101 టెంకాయలు కొట్టి, విశేష పూజలు చేయించారు. దేశంలో మధ్యంతర ఎన్నికల ఫలితాలలో విజయం సాధించ డంతో కాంగ్రెస్‌ పార్టీ, రాహుల్‌గాంధీ వైపు ప్రజలు ముందడుగు వేశారన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు రాష్ట్రంలో వైసీపీపై ఉన్న వ్యతిరేకత ఏమిటో తెలిపారని చెప్పారు. మదనపల్లె నియోజక వర్గంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-18T23:26:45+05:30 IST