పోలీస్టేషనను ఎస్పీ ఆకస్మిక తనిఖీ

ABN , First Publish Date - 2023-09-25T23:32:18+05:30 IST

ములకలచెరువు పోలీస్‌స్టేసనను సోమవారం రాత్రి ఎస్పీ కృష్ణారా వు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 పోలీస్టేషనను ఎస్పీ ఆకస్మిక తనిఖీ
పోలీస్‌స్టేషనలో మాట్లాడుతున్న ఎస్పీ కృష్ణారావు

ములకలచెరువు, సెస్టెంబరు 25: ములకలచెరువు పోలీస్‌స్టేసనను సోమవారం రాత్రి ఎస్పీ కృష్ణారా వు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీ లించి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం స్టేషన పరిస రాలను పరిశీలించారు. ఆయన వెం ట ఇనచార్జి సీఐ శివాంజనేయులు, ఎస్‌ఐ గాయత్రి ఉన్నారు.

తంబళ్లపల్లెలో: తంబళ్లపల్లె పోలీస్టేషనను ఎస్పీ కృష్ణారావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రిసెప్షనను సంద ర్శించి సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌ కేసుల వివరాలను ఆరా తీసి త్వరగా పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. పాత నేరస్తులు, రౌడీషీటర్లపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే చోట కారణాలు గుర్తించి, ప్రమాదాలు చోటుచేసు కోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా స్టేషన పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఎస్‌ఐ లోకేష్‌రెడ్డి, ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఉన్నారు.

పెద్దమండెంలో: గ్రామాలు, పట్టణాల్లో శాంతి భద్రతలు పరిరక్షించా లని జిల్లా ఎస్పీ కృష్ణారావు పేర్కొన్నారు. సోమవారం పెద్దమండ్యెం మండలంలో ఎస్పీ పర్యటించి స్థానిక పోలీసుస్టేషనను తనిఖీ చేశారు. సమస్యాత్మక గ్రామాల గురించి అలడిగి తెలుసుకున్నారు. పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించాలన్నారు. ఎస్‌ఐ రామాంజనేయుడు, పోలీ సు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-09-25T23:32:18+05:30 IST