నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ అవకాశాలు: కలెక్టర్
ABN , First Publish Date - 2023-06-07T23:01:53+05:30 IST
నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ గిరీషా అ న్నారు.
రాయచోటి (కలెక్టరేట్) జూన 7: నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ గిరీషా అ న్నారు. బుధవారర స్కిల్ డెవ లప్‌మెంట్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న యువతీ యువకులకు దాదాపు 30 మం దికి నియామక పత్రాలు అంద జేశారు. వీరందరికి హైదరాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్లో నెలకు రూ. 18 వేల వేతనంతో ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన అహ్మద్‌ఖాన, డీఅర్‌వో సత్యనారాయణ, స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి హరికృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్ శివశంకర్, స్కిల్ హబ్ కోఆర్డినేటర్ గణేశ సిబ్బంది పాల్గొన్నారు.