శ్మశాన వాటికకు దారి చూపండి..
ABN , First Publish Date - 2023-04-03T23:00:29+05:30 IST
శ్మశాన వాటి కకు దారి చూపాలని కోరుతూ రామ సముద్రం మండలం ఊలపాడు పంచా యతీ గంపనపల్లె గ్రామస్తులు సోమ వారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
రామసముద్రం, ఏప్రిల్ 3: శ్మశాన వాటి కకు దారి చూపాలని కోరుతూ రామ సముద్రం మండలం ఊలపాడు పంచా యతీ గంపనపల్లె గ్రామస్తులు సోమ వారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ శ్మశాన వాటికకు వెళ్లే మార్గాన్ని భాస్క రాచారి అనే వ్యక్తి ఆక్రమించడంతో ఇబ్బందులు పడుతున్నామని వీఆర్‌వోకు పలు మార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ పరిధిలో సమ స్యలు పరిష్కారం కాకపోవడంతో కూలి పనులతో జీవించే తాము పనులు వదులుకుని అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ దైవరాజన వీఆర్వో శ్రీనివాసులును ఆదేశించారు.