నాముగడ్డి తిని గొర్రెలు మృతి

ABN , First Publish Date - 2023-04-06T23:09:09+05:30 IST

మండల పరిధిలోని పెద్ద పసుపుల గ్రామ శివారు పొలాల్లో నాము గడ్డి తిని 12 గొర్రెలు మృతి చెందాయి.

నాముగడ్డి తిని గొర్రెలు మృతి

పెద్దముడియం, ఏప్రిల్‌ 6 : మండల పరిధిలోని పెద్ద పసుపుల గ్రామ శివారు పొలాల్లో నాము గడ్డి తిని 12 గొర్రెలు మృతి చెందాయి. మైలవరం మండలం కంబాలదిన్నెకు చెందిన పుల్లయ్య తదితరుల గురువారం గొర్రెలను మండలంలోని పలు గ్రామాల్లో మేపుతూ స్వగ్రామం కంబాలదిన్నె గ్రామానికి వెళ్లే దారిలో పెద్ద పసుపులవద్ద గొర్రెల మందలోని పలు గొర్రెలు నాముగడ్డిని తినడంతో తీవ్ర అస్వస్తతకు గురై అక్కడికక్కడే మృతి చెందాయి. ఇలా 12 గొర్రెలు మృతి చెందగా దాదాపు రెండు లక్షల రూపాయలు నష్టం వాటిల్లినట్లు బాధిత యజమాని పుల్లయ్య తెలిపారు.

Updated Date - 2023-04-06T23:09:21+05:30 IST