రాష్ర్టానికి పట్టిన శని జగన్
ABN , First Publish Date - 2023-09-25T22:56:22+05:30 IST
రాష్ర్టానికి పట్టిన శని జగన్‌మోహన్‌రెడ్డి అని, సైకోల పాలన నుంచి త్వరలోనే రాష్ర్టానికి విముక్తి లభించనుందని రాయచోటి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రమేశ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

రాయచోటిటౌన్, సెప్టెంబరు 25: రాష్ర్టానికి పట్టిన శని జగన్‌మోహన్‌రెడ్డి అని, సైకోల పాలన నుంచి త్వరలోనే రాష్ర్టానికి విముక్తి లభించనుందని రాయచోటి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రమేశ్‌కుమార్‌రెడ్డి అన్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 14 రోజులుగా నిర్వహిస్తున్న దీక్షల్లో సోమవారం దివ్యాంగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబును అరెస్టు చేసి వైసీపీ నాయకులు పైచేయి సాధించామని సంబరపడవచ్చన్నారు. కానీ అంతిమ విజయం ఎప్పుడూ ధర్మంవైపే ఉంటుందనే విషయం చంద్రబాబు కడిగిన ముత్యంగా జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు వారికే తెలుస్తుందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి కారణంగా రాష్ట్రం దారిద్య్రరేఖకు దిగువకు వెళ్లిపోయిందని, ప్రతి ఒక్కరి తలపైన రూ.2.16 లక్షల అప్పు ఉందన్నారు. పేద ప్రజల కష్టంతో జగన్‌మోహన్‌రెడ్డితో పాటు తన సైకో గ్యాంగు ఖజానాలు నింపుకుంటున్నారని ఆరోపించారు. ప్రపంచంలోని 73 దేశాల్లో చంద్రబాబు అరెస్టు అక్రమమని పెద్ద ఎత్తున ర్యాలీలు, ఆందోళనలు చేస్తుండడం ఆయన నిజాయితీకి నిదర్శనమన్నారు. అనంతరం నేతాజీ సర్కిల్ వద్ద నేను సైతం బాబుతోనే అంటూ రమేశ్‌కుమార్‌రెడ్డి తొలి సంతకం పెట్టి ప్రారంభించి కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా, దివ్యాంగుల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాసులు, సెక్రటరీ లక్ష్మినారాయణ, అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమార్, జిల్లా మహిళా కార్యదర్శి హేమలత, జిల్లా కార్యదర్శి ముస్తఫా, గాలివీడు మండల అధ్యక్షుడు తులసీరామ్, వీరబల్లి మండల అధ్యక్షుడు రామచంద్ర, టీడీపీ గాలివీడు క్లస్టర్ ఇన్‌చార్జి సత్యారెడ్డి, అబీద్, రాజంపేట పార్లమెంట్ ప్రచార కార్యదర్శి మహబూబ్‌అలీఖాన్, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
వైసీపీకి పోయే కాలం దగ్గర పడింది
రైల్వేకోడూరు: వైసీపీ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర పడిందని రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జి కస్తూరి విశ్వనాథనాయుడు అన్నారు. సోమవారం రైల్వేకోడూరు పార్టీ కార్యాలయం ఎదుట చంద్రబాబనాయుడును అక్రమంగా అరెస్టు చేసిందుకు చేపట్టిన రిలే దీక్షలు 12వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దౌర్జన్యాలు, అక్రమాలు, భూకబ్జాలు పెరిగిపోతున్నాయన్నారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎదుర్కొంటున్న టీడీపీ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకులు నాయుడోరి రమణ, యువనేత కేకే చౌదరి, దళిత నాయకుడు పుల్లెల రమేష్‌బాబు, నాయకురాలు దుద్యాల అనితదీప్తి, భారీ ఎత్తున యువత పాల్గొన్నారు.
పుల్లంపేట: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కస్తూరి విశ్వనాధనాయుడు ఆధ్వర్యంలో నాయకులు సోమవారం పుల్లంపేటలోని షిర్డిసాయి ఆలయంలో పూజలు నిర్వహించారు. కొవ్వొత్తులతో నిరసన తెలియజేశారు. మండల ఇన్‌చార్జి ఆరే సుధాకర్ నాయుడు, తెలుగు రైతు అధ్యక్షుడు కేశినేని వెంకటేష్ నాయుడు, జగదీశ్వర్‌రెడ్డి, ఈశ్వరయ్య, రంగారెడ్డి, భరత్, చిన్నం శివయ్య, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.