పాఠశాలలు నేటి నుంచే

ABN , First Publish Date - 2023-06-11T23:36:29+05:30 IST

వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి.

పాఠశాలలు నేటి నుంచే

శనివారం వరకు ఒంటిపూట బడులు

కడప (ఎడ్యుకేషన్‌), జూన్‌ 11: వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర పాఠశాలల విద్యాకమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. అయితే అధిక వేడి నేపథ్యంలో ఈ నెల 12 నుంచి 17వతేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 11.30 వరకు మాత్రమే పాఠశాలలు పనిచేయాలని అందులో పేర్కొంది. అన్ని యాజమాన్యాలకు సంబంధించి ప్రాథమిక పాఠశాలలు 1849, ప్రాథమికోన్నత పాఠశాలలు 397, ఉన్నత పాఠశాలలు 620 మొత్తం 2,866 పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపు 3,18,077 మంది విద్యార్థులు బడి మెట్లు ఎక్కనున్నారు.

విద్యాకానుక కిట్లు పంపిణీ

జిల్లా వ్యాప్తంగా 2,094 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో జగనన్న విద్యాకానుక కిట్లను సోమవారం నుంచి పంపిణీ చేయనున్నారు. ఈ పాఠశాలల్లో లక్షా 58 వేల 156 మంది విద్యార్థులకు రూ.40 కోట్ల నిధులతో విద్యాకానుక ద్వారా 3 జతల యూనిఫాంలు, 2 జతల సాక్సులు, ఒక జత షూస్‌, బ్యాగు, బెల్టు, టెక్స్ట్‌ బుక్స్‌, నోటు పుస్తకాలు, డిక్షనరీ అందిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్‌ ప్రాఽథమిక పాఠశాలలు 1,647 ఉన్నాయి. వీటిలో 66,997 మంది విద్యార్థులకు విద్యాకానుక కిట్లను అందించేందుకు ప్రభుత్వం సిద్ధం చేసింది. అలాగే 142 ప్రాఽథమికోన్నత పాఠశాలల్లో 15,434 మంది విద్యార్థులకు, 310 ఉన్నత పాఠశాలల్లో 75,725 మందికి కిట్లను పంపిణీ చేయనున్నారు.

ప్రతి విద్యార్థికి కిట్లు అందజేస్తాం

- అంబవరం ప్రభాకర్‌రెడ్డి, సమగ్రశిక్ష పథక అఽధికారి

ప్రతి పాఠశాలలో 8 రకాల వస్తువులతో కూడిన జగనన్న విద్యాకానుక కిట్లను ఇప్పటికే సిద్ధం చేశాం. వీటన్నింటినీ పాఠశాలలు పునఃప్రారంభించిన రోజే బయోమెట్రిక్‌ అథెంటిఫికేషన్‌ ద్వారా ప్రతి విద్యార్థికి అందజేస్తాం.

Updated Date - 2023-06-11T23:36:29+05:30 IST