ఎస్సీ వర్గకరణకు చట్టబద్ధత కల్పించాలి
ABN , First Publish Date - 2023-09-22T23:39:52+05:30 IST
: ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ఎస్పీ వర్గీకరణకు చట్టబ ద్ధత కల్పించి మాదిగ ఉపకులాలకు విద్య, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధికి తోడ్ప డాలని ఎమ్మార్పీఎస్ నేతలు కలెక్టర్ పీఎస్ గిరిషాను కోరారు.
మదనపల్లె అర్బన, సెప్టెంబరు 22: ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ఎస్పీ వర్గీకరణకు చట్టబ ద్ధత కల్పించి మాదిగ ఉపకులాలకు విద్య, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధికి తోడ్ప డాలని ఎమ్మార్పీఎస్ నేతలు కలెక్టర్ పీఎస్ గిరిషాను కోరారు. ఆమేరకు జిల్లా కేంద్రంలో కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకు డు మందకృష్ణమాదిగ ఆదేశాలతో ఎమ్మా ర్పీఎస్, ఎంఎస్‌పీ జిల్లా ఇనచార్జి రాజు మాదిగ, జిల్లా అధికార ప్రతినిధి రవీంద్ర మాదిగ, తంబళ్ళపల్లె, పీలేరు, మదనపల్లె టౌన ఎంఎస్‌పీ ఇనచార్జిలు దుమ్ము చిన్నా మాదిగ, వెంకటేష్ మాదిగ, రాజా మాదిగ, ఎమ్మార్పీఎస్ మదనపల్లె, పీలేరు నియెజక వర్గాల ఇన చార్జిలు రెడ్డిశేఖర్ మాదిగ, ఎర్రయ్య మాదిగలు కలెక్టర్‌ను కలిసి సమస్యలను విన్నవిం చారు. కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు స్వర్ణలత, నాయకులు శ్రీనివాసులు, చలపతి, వెంటకరమణ, మంజునాధ్, అంజిబాబు, నాగేశ్వరయ్య పాల్గొన్నారు.