ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలి

ABN , First Publish Date - 2023-09-22T00:00:05+05:30 IST

ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ కోసం బిల్లు ప్రవేశపెట్టాలని ఎమ్మా ర్పీఎస్‌, ఎంఎస్‌పీ శ్రేణులు డిమాండ్‌ చేశారు.

ఎస్సీ వర్గీకరణ బిల్లును  ప్రవేశపెట్టాలి
రాస్తారోకో చేస్తున్న ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌పీ శ్రేణులు

పీలేరు, సెప్టెంబరు 21: ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ కోసం బిల్లు ప్రవేశపెట్టాలని ఎమ్మా ర్పీఎస్‌, ఎంఎస్‌పీ శ్రేణులు డిమాండ్‌ చేశారు. గత 10 రోజులుగా వివిధ రూపాల్లో నిరసనలతోపాటు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌పీ శ్రేణులు గురువారం పీలేరు పట్టణంలోని కర్నూలు-చెన్నై జాతీయ రహాదారిపై బైఠా యించి రాస్తారోకో చేశారు. రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించిపోవడం తో సమాచారం అందుకున్న పీలేరు అర్బన సీఐ మోహన రెడ్డి హుటాహుటిన అక్కడకు చేరుకుని ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌పీ శ్రేణు లను తమ వాహనంలో స్టేషనకు తరలించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ నాయకులు కేఎన రాజు మాదిగ, గండికోట వెంకటేశ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతు న్న ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని తాము డిమాండ్‌ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం వారిని పోలీసులు స్వంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. ఈ కార్యక్రమంలో స్వర్ణలత, హుస్సేనయ్య, సుబ్బయ్య, మల్లిఖార్జున, చరణ్‌, కిరణ్‌, ఫైరోజ్‌ఖాన, మత్తయి, రాము, రమణ, నందు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T00:00:05+05:30 IST