వ్యవసాయ, అనుబంధ శాఖలలో కొలువుల హడావిడి
ABN , First Publish Date - 2023-06-02T00:09:26+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యవసాయశాఖతో పాటు అనుబంధశాఖలలో బదిలీలను చేపట్టింది. ఈమేరకు వ్యవసాయశాఖతో పాటు పశుసంవర్ధక, మార్కెటింగ్, మత్స్య, పట్టుపరిశ్రమ తదితర శాఖలలో గురువారం కొలువుల హడావిడి చోటుచేసుకుంది.
కడప(రూరల్), జూన్ 1: రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యవసాయశాఖతో పాటు అనుబంధశాఖలలో బదిలీలను చేపట్టింది. ఈమేరకు వ్యవసాయశాఖతో పాటు పశుసంవర్ధక, మార్కెటింగ్, మత్స్య, పట్టుపరిశ్రమ తదితర శాఖలలో గురువారం కొలువుల హడావిడి చోటుచేసుకుంది. బదిలీ అయిన ఉద్యోగులు వారి స్థానాల నుంచి రిలీవ్ కాగా వారి స్థానాలలో వచ్చిన అధికారులు ఆయా క్యాడర్లలో బాధ్యతలను చేపట్టారు.
వ్యవసాయశాఖలో: జిల్లా వ్యవసాయశాఖలో వివి ధ క్యాడర్లకు సంబంధించి మొత్తం 10 మంది అధికారులను బదిలీ చేశారు. వీరిలో జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో ఏడీగా పనిచేస్తు న్న రాధాదేవి తిరుపతికి బదిలీ అయ్యారు. ఈమె స్థానంలో కర్నూల్ నుంచి మాధవి వచ్చారు. అలాగే డీడీఏ క్యాడర్ సాయిల్ కంజర్వేషన్‌లో పనిచేసే ప్రసాద్ అనంతపురం బదిలీ కాగా ఈయన స్థానంలో విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చారు. అలాగే డీడీఏ సాయిల్ కన్జర్వేషన్ సీనియర్ అసిస్టెంట్, ఏడీ సాయిల్ కన్జర్వేషన్‌లో పనిచేసే సీనియర్ అసిస్టెంట్‌లు బదిలీ అయ్యారు. అలాగే తొండూరు, కొండాపురం, ప్రొద్దుటూరు, సింహాద్రిపురం, సికే దిన్నె, కలసపాడు మండలాలకు చెందిన ఏవోలు బదిలీ అయ్యారు. వీరి స్ధానంలో ఇతర జిల్లాల నుంచి పలువురు ఏవోలు వచ్చారు. ఇక మార్కెటింగ్‌శాక ఏడీ కార్యాలయలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న జయరాజ్‌ను రాజంపేటకు బదిలీ చేయగా అక్కడ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న నాగవేణి ఇక్కడికి వచ్చారు. జిల్లా పశుసంవర్థకశాఖలో గురువారం కూడా బదిలీ ప్రక్రియ కొలిక్కి రానట్లు సమాచారం.