గ్రామీణ సడక్‌ యోజన రోడ్లకు మోక్షం ఎప్పుడో ?

ABN , First Publish Date - 2023-05-31T23:22:32+05:30 IST

కేంద్ర ప్రభుత్వం పథకం కింద నిర్మించిన గ్రామీణ సడక్‌ యోజన రోడ్డు. ఏళ్ల గడిచినా మరమ్మత్తులు చేయకపోవడంతో అడుగడుగునా గుంతలు పడి కంకర తేలి మడుగులుగా మారి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.

గ్రామీణ సడక్‌ యోజన రోడ్లకు మోక్షం ఎప్పుడో ?
దెబ్బతిన్న నరస్సారెడ్డిపల్లె- వడ్లపల్లె రోడ్డు - వడ్లపల్లె వద్ద కోతకు గురైన రోడ్డు

సంబేపల్లె, మే31: కేంద్ర ప్రభుత్వం పథకం కింద నిర్మించిన గ్రామీణ సడక్‌ యోజన రోడ్డు. ఏళ్ల గడిచినా మరమ్మత్తులు చేయకపోవడంతో అడుగడుగునా గుంతలు పడి కంకర తేలి మడుగులుగా మారి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా వెళ్లినా ప్రమాదం జరగక తప్పదు. ఎదురుగా వాహనాలు వ స్తే ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు. మండలంలో గ్రామీణ సడక్‌ యోజన కింద నిర్మించిన రోడ్లే ఇందుకు నిదర్శనం. రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ నిధుల కింద నిర్మించిన రోడ్లకు ఆరు నెలకు ఒకసారి జంగిల్‌ క్లియరెన్స్‌, మరమ్మత్తులు చేపడుతుంటారు. గ్రామీణ యోజన రోడ్లకు మాత్రం నిధులు లేకపోవడంతో వాటి మరమ్మత్తులు మరిచిపోయారు. ఏళ్ల తరబడి ఎదురుచూపులు తప్పడం లేదు.

నర్సారెడ్డిగారిపల్లె రోడ్డు నుంచి వడ్లపల్లె వరకు రెండున్నర కిలోమీటర్లు, కోటకాడపల్లె రోడ్డు నుంచి వడ్లపల్లె రోడ్డు వరకు గ్రామీణ సడక్‌ యోజన కింద తారురోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ రోడ్లు చూస్తే అడుగడుగునా గుంతలే. నిత్యం ఈ రోడ్డు మార్గంలో వాహనదారులు ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. వర్షం వస్తే గుం తల నిండా వర్షపు నీరు చేరి మడుగును తలపిస్తున్నాయి. సుమారు ఆరేళ్లవుతున్నా గుంతలకు మట్టి వేసి మరమ్మత్తులు చేసి న పాపాన పోలేదు. ఈ రోడ్డు మార్గం గుం డా సుండుపల్లె, కలకడ వివిధ ప్రాంతాల కు ప్రయాణికులు నిత్యం వెళుతుంటారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రోడ్ల మరమ్మత్తులకు నిధులు కేటాయించి మరమ్మత్తు లు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

Updated Date - 2023-05-31T23:22:32+05:30 IST