పీఎం కిషాన్‌ కింద రూ.154.87 కోట్లు మంజూరు

ABN , First Publish Date - 2023-05-31T23:28:37+05:30 IST

జిల్లాకు సంబంధించి వైఎ్‌సఆర్‌ రైతు భరోసా-పీఎం కిషాన్‌ కింద వరుసగా 5వ సంవత్సరంలో మొదటి విడత కింద 2,05,600 మంది రైతులకు రూ.154 కోట్ల 87 లక్షల 10వేలు మంజూరయ్యాయి.

పీఎం కిషాన్‌ కింద రూ.154.87 కోట్లు మంజూరు

కడప(రూరల్‌) మే 31 : జిల్లాకు సంబంధించి వైఎ్‌సఆర్‌ రైతు భరోసా-పీఎం కిషాన్‌ కింద వరుసగా 5వ సంవత్సరంలో మొదటి విడత కింద 2,05,600 మంది రైతులకు రూ.154 కోట్ల 87 లక్షల 10వేలు మంజూరయ్యాయి. ఇందులో బద్వేల్‌ నియోజక వర్గంలో 35,152 మంది రైతులకు రూ.26.479 కోట్లు, జమ్మలమడుగు 37,990 మంది రైతులకు రూ.28.616 కోట్లు, కడప 1081 మంది రైతులకు రూ.08.143 కోట్లు, అలాగే కమలాపురం 32656 మంది రైతులకు రూ.24.598 కోట్లు, మైదుకూరు 36456 మంది రైతులకు రూ.27.461 కోట్లు, ప్రొద్దుటూరు 10975 మంది రైతులకు రూ.8.671 కోట్లు, పులివెందుల నియోజ కవర్గంలో 44798 మంది రైతులకు రూ.33.744 కోట్లు మంజూ రైంది. అలాగే ఒంటిమిట్ట మండలంలో 3176 మంది రైతులకు రూ.2.392 కోట్లు, సిద్దవటం మండలలో 3316 మంది రైతులకు రూ.2.497 కోట్లు మంజూరైంది. అలాగే 2023 మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో జరిగిన పంటనష్టాలకు గాను 1349 మంది రైతులకు వ్యవసాయ, ఉద్యాన పంటల ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద జిల్లాకు రూ.ఒక కోటి 67 లక్షల 8వేలు మంజూరైంది. ఈ నిధులను త్వరలో రైతుల ఖాతాలకు జమచేయనున్నారు.

Updated Date - 2023-05-31T23:28:37+05:30 IST