‘సైకిల్ తొక్కండి ఆరోగ్యంగా ఉండండి’
ABN , First Publish Date - 2023-03-05T23:46:06+05:30 IST
సైకిల్ తొక్కండి ఆరోగ్యంగా ఉండండి.. ప్రతి ఒక్కరి ఆరో గ్యానికి భరోసా సైనిల్ వ్యా యామం అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కొండయ్య అన్నారు.
రాయచోటి టౌన్, మార్చి 5: సైకిల్ తొక్కండి ఆరోగ్యంగా ఉండండి.. ప్రతి ఒక్కరి ఆరో గ్యానికి భరోసా సైనిల్ వ్యా యామం అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కొండయ్య అన్నారు. అంతర్జా తీయ మహిళా వారోత్సవాల్లో భాగంగా ఆదివారం డీఎం హెచ్‌వో ఆధ్వర్యంలో రాయ చోటి ఆర్టీసీ బస్టాండు నుంచి గాలివీడు రోడ్డులోని గ్రూప్ థియేటర్స్ వరకు సైకిల్ తొక్కండి ఆరోగ్యంగా ఉం డండి అనే నినాదంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరక శ్రమ లేకపోవడం, ఆహార నియమాలు సరిగ్గా పాటించకపోవడం వలన రక్తపోటు, షుగర్ తదితర సమస్యలు వస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ సైకిల్ తొక్కడం, వాకింగ్ చేయడం, యోగా, జిమ్ ఇతర వ్యాయామాలతో రక్తపోటు, షుగర్ వ్యాధులు కంట్రోల్ చేయవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ర్టిక్ సర్వైవలెన్స్ ఆఫీసర్ డాక్టర్ రియాజ్‌బేగ్, సీహెచ్‌వో నారాయణ, హెల్త్ ఎడ్యుకేటర్స్ బలరామరాజు, రాజగోపాల్, హెల్త్ సూపర్ వైజర్స్ వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసులు, హెల్త్ అసిస్టెంట్ రవిశంకర్, అర్బన్ పరిధిలోని ఆరోగ్య కార్యకర్తలు, ఆశకార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.