ఫేషియల్‌ యాప్‌లో హాజరు నమోదు తప్పనిసరి

ABN , First Publish Date - 2023-09-25T23:19:28+05:30 IST

ఇంటర్మీడియట్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న అధ్యాపక, అధ్యాపకేతర బృందం తప్పనిసరిగా పేషియల్‌ యాప్‌లో హాజరు నమోదు చేయాలని ఇంటర్మీడియట్‌ ఆర్‌జేడీ రవి తెలిపారు.

 ఫేషియల్‌ యాప్‌లో హాజరు నమోదు తప్పనిసరి

ఇంటర్మీడియట్‌ ఆర్‌జేడీ రవి

కడప (ఎడ్యుకేషన్‌), సెప్టెంబరు 25: ఇంటర్మీడియట్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న అధ్యాపక, అధ్యాపకేతర బృందం తప్పనిసరిగా పేషియల్‌ యాప్‌లో హాజరు నమోదు చేయాలని ఇంటర్మీడియట్‌ ఆర్‌జేడీ రవి తెలిపారు. సిలబస్‌ సకాలంలోపూర్తి చేయాలని ఆదేశించారు. సోమవారం కడప నగరం సెయింట్‌ జోసెఫ్‌ జూనియర్‌ కాలేజీలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు గైర్హాజరు కాకుండా త ప్పనిసరిగా హాజరు కావాలన్నారు. స్టూడెంట్‌ ఇన్‌ఫో లాగిన్‌ క్రెడెన్షియల్‌ సమాచారం అప్‌డేట్‌లో ఉండాలని తెలిపారు. ప్రతి జూనియర్‌ కళాశాలలో స్టడీఅవర్‌ ఏర్పా టు చేసి.. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉత్తీర్ణత సాధించేందకు కృషి చేయాలని తెలిపారు. నాడు నేడు పనులు సత్వరం పూర్తి చేయాలని సూచించారు. అనంతరం డీవీఈవో శ్రీనివాసులరెడ్డి, ఆర్‌ఐవో రమణరాజు ప్రసంగించారు. జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లు, హెచ్‌సీఎల్‌ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-25T23:19:28+05:30 IST