జీడీఎస్‌ కమిటీ సిఫారసులు అమలు చేయాలి

ABN , First Publish Date - 2023-03-02T23:33:54+05:30 IST

భారత తపాలా శాఖలో గ్రామీణ తపాలా ఉద్యోగులతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని ఏఐజీడీఎస్‌యూ డివిజన్‌ సెక్రటరీ ఆదినారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

జీడీఎస్‌ కమిటీ సిఫారసులు అమలు చేయాలి
హెడ్‌ పోస్టాపీసు ఎదురుగా ధర్నా చేస్తున్న గ్రామీణ తపాలా ఉద్యోగులు

గ్రామీణ తపాలా ఉద్యోగుల ధర్నా

ప్రొద్దుటూరు అర్బన్‌, మార్చి 2: భారత తపాలా శాఖలో గ్రామీణ తపాలా ఉద్యోగులతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని ఏఐజీడీఎస్‌యూ డివిజన్‌ సెక్రటరీ ఆదినారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం స్ధానిక డివిజన్‌ హెడ్‌ పోస్టాపీసు కార్యాలయం వద్ద జీడీఎస్‌లు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీడీఎస్‌ కమిటీ సిపారసులను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. సీనియర్లకు ఇంకిమెంట్రు అమలు చేయడం లేదనా ్నరు. గ్రామాల్లో జనాభాకంటే ఎక్కువగా తపాలా ఖాతాలు చేయాలనే ఒత్తిళ్ళతో జీడీఎస్‌లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దాదాపు ఏడాదిగా పెండింగ్‌లో వున్న జీడీఎస్‌ సబ్‌స్టిట్యూట్‌ల జీతాలు వెంటనే చెల్లించాలన్నారు. అనంతరం పోస్టల్‌ సూపరిండెంట్‌ రవిబాబుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జీడీఎస్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ గౌస్‌పీర్‌, అసిస్టెంట్‌ సెక్రటరీ నరసయ్య శీను, ఎఫ్‌ఎన్‌పీవో ఆర్‌ఆర్‌ డేవిడ్‌ రాజు మద్దతు పలికారు

Updated Date - 2023-03-02T23:33:54+05:30 IST