Share News

రైల్వేకోడూరు ఎమ్మెల్యే దౌర్జన్యాలు నశించాలి

ABN , Publish Date - Dec 14 , 2023 | 12:07 AM

రైల్వేకోడూరులో శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న అంగనవాడీలపై ఎమ్మెల్యే కొరముట్ల శ్రీని వాసులు దౌర్జన్యాలు నశించాలని సీఐటీయూ నాయకురాళ్లు ద్వజమె త్తారు.

రైల్వేకోడూరు ఎమ్మెల్యే దౌర్జన్యాలు నశించాలి
మదనపల్లెలో అంగనవాడీల సమ్మెలకు మద్దతుగా నిరసనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నవాజ్‌బాషా

అంగనవాడీల జోలికొస్తే ఊరుకోము రెండో రోజు కొనసాగిన సమ్మె జనసేన పార్టీ నేతల మద్దతు సమస్యలు పరిష్కరించేవరకు ఉద్యమం ఆగదంటున్న వైనం

మదనపల్లె టౌన, డిసెంబరు 13: రైల్వేకోడూరులో శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న అంగనవాడీలపై ఎమ్మెల్యే కొరముట్ల శ్రీని వాసులు దౌర్జన్యాలు నశించాలని సీఐటీయూ నాయకురాళ్లు ద్వజమె త్తారు. బుధవారం మదనపల్లె ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట ప్రాజె క్టు పరిధిలోని అంగనవాడీలు రెండో రోజు సమ్మెలో పాల్గొని నిరస నలు తెలిపారు. ఈ సందర్భంగా మధురవాణి, గంగాదేవి మాట్లాడు తూ తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం శాంతియుతంగా సమ్మె చేస్తుంటే రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, అయ న అనుచరులు దౌర్జన్యం చేయడం, టెంట్లు పీకివేయడం దారుణమ న్నారు. అంగనవాడీల జోలికొస్తే ఊరుకోమని వారు హెచ్చరించారు. సీఐటీయూ మాజీ అధ్యక్షురాలు రెడ్డెమ్మ,, సెక్టార్‌ నాయకురాళ్లు సుజన, విజయ, సుజాత, అఖీరున్నీసా, గీత పాల్గొన్నారు.

అంగనవాడీల సమ్మెకు షాజహానబాషా సంఘీభావం

మదనపల్లె ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట నిరసనలు తెలుపుతున్న అంగనవాడీలకు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే షాజహానబాషా సంఘీ భావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అంగనవాడీ సెంటర్లను మూసివేయాలని సీఎం జగన పన్నాగం పన్నుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మ్యాచింగ్‌ గ్రాంటుకు రాష్ట్ర ప్రభుత్వం జోడించి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కార్యక్ర మంలో టీడీపీ నాయకులు షంషీర్‌, నాగూర్‌వలి, బాలు పాల్గొన్నారు.

అంగనవాడీల సమ్మెకు జనసేన మద్దతు

మదనపల్లె, డిసెంబరు 13: మదనపల్లె ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదు ట ధర్నా చేస్తున్న అంగనవాడీ వర్కర్లు, హెల్పర్లకు జనసేన నాయకు లు మద్దతు తెలిపారు. ఆ పార్టీ నియోజకవర్గ నేత శ్రీరామ రామాం జనేయులు, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనితలు పార్టీ కార్యకర్తలతో కలసి బుధవారం..ఆ సంఘం నాయకురాలు మధువాణి తో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నా రు. అనంతరం శ్రీరామ రామాంజనేయులు, దారం అనితలు మా ట్లాడుతూ అంగనవాడీ సమస్యలను జనసేన అధినేత పవనకళ్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వం ఒత్తిడి పెంచి పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్‌ వింగ్‌ అద్యక్షుడు సుప్రీంహర్ష, ఉపాధ్యక్షుడు సోను, అరవింద్‌ గని, మంజు, చరణ్‌, గణేస్‌, వినయ్‌, పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.

మదనపల్లె అర్బన: అంగనవాడీల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక మా ర్కెట్‌ యార్డు వద్ద అంగనవాడీ కార్యకర్తలు, ఆటో యూనియన నా యకులతో కలిసి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈసం దర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ మాట్లాడు తూ నాలుగన్నరేళ్లుగా సీఎం జగన ఇచ్చిన హామీలను నెరవెర్చలేదన్నా రు. కనీసవేతనం రూ. 26వేలు చేయాలని, 2022లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయలేదని ఆరోపించారు. కార్యక్ర మంలో ఏఐటీయూసీ నాయకులు ఖాదర్‌బాషా, తిరమల, రవి, బావాజాన, హరి, మురళి, ఏపీ ఆటో డ్రైవర్స్‌ వర్కర్స్‌ ఫెడరేషన నాయకులు రెడ్డెప్ప, అంగనవాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

బి.కొత్తకోటలో:రాష్ట్రంలోని అంగనవాడీల న్యాుఽమైన డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం సానుభూతితో ఆలోచించాలని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి ఎస్‌ఎం పర్వీనతాజ్‌ పేర్కొన్నారు. బి.కొత్తకోట పట్టణంలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట అంగనవాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం రెండవ రోజుకు చేరిన సందర్బంగా ఆమె సమ్మెలో పాల్గొని సంఘీభావం ప్రకటించా రు. అంగనవాడీ యూనియన నేతలు మాట్లాడుతూ నెలకు రూ. 26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయ కులు శ్రీవాణి, ఈశ్వరమ్మ, రాజేశ్వరి, పీటీఎం, ములకలచెరువు, బి.కొత్తకో ట మండలాల అంగనవాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.

కలికిరిలో: మండలంలో అంగనవాడీ కార్యకర్తలు, ఆయాలు చేస్తున్న సమ్మె బుధవారం రెండవ రోజు కూడా కొనసాగింది. ఫలితంగా మం డలంలో మొత్తం 61 మెయిన అంగనవాడీ కేంద్రాలు, 2 మినీ కేంద్రా లు మూతబడ్డాయి. దీర్ఘకాలంగా అపరిస్కృతంగా ఉన్న డిమాండ్ల సాధన కోసం వ అంగనవాడీ కార్యకర్తలు, ఆయాలు సమ్మెకు దిగారు. దీంతో పిల్లలకు ఉద్దేశించిన కోడిగుడ్లు, పాల ప్యాకెట్లు పాడయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక గర్భిణులు, బాలింతలకు అందజేయాల్సిన పోషకాహారాల పంపిణీ స్థంభించింది.

వాల్మీకిపురంలో: స్థానిక ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట రెండవరోజు అంగనవాడీలు ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గుర్రంకొండ, వాల్మీకిపురం, కలికిరి మండలాలకు చెందిన అంగన వాడీ కార్యకర్తలు నిరసనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూని యన లీడర్లు మాట్లాడుతూ అంగనవాడీల వేతనాలు రూ.26వేలు ఇవ్వాలన్నారు. డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే దాకా ఆందోళన లు కొన సాగిస్తామన్నారు. కార్యక్రమంలో యూనియన లీడర్లు చంద్రావతి, భూకైలేశ్వరి, లక్ష్మీనరసమ్మ, అమ్మాజీ, పార్వతి, ఆదిలక్ష్మీ, వివిధ మండలాల కార్యకర్తలు, హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2023 | 12:08 AM