వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత సుస్పష్టం
ABN , First Publish Date - 2023-03-19T23:26:49+05:30 IST
ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డి అధికారంలోకి వచ్చి విద్యావంతులు, ఉద్యోగ ఉపాధ్యాయులను, నిరుద్యోగులను, యువతను నమ్మిం చి మోసం చేసినందుకు నిదర్శనంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మె ల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులందరూ గెలవడంతో జగన ప్రభుత్వంపై వ్యతిరేకత సుస్పష్టమైందని టీడీపీ నేతలు పేర్కొన్నారు.

కడప (ఎర్రముక్కపల్లె), మార్చి 19 : ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డి అధికారంలోకి వచ్చి విద్యావంతులు, ఉద్యోగ ఉపాధ్యాయులను, నిరుద్యోగులను, యువతను నమ్మిం చి మోసం చేసినందుకు నిదర్శనంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మె ల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులందరూ గెలవడంతో జగన ప్రభుత్వంపై వ్యతిరేకత సుస్పష్టమైందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. రాబోవు ఎన్నికల్లో టీడీపీదే విజయమని స్పష్టం చేశారు. ఆదివా రం కడప నగరం హరిటవర్స్‌లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్, బెస్త సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్ యాటగిరి రాంప్రసాద్, జిల్లా కార్యదర్శి కొమ్మలపాటి సురేష్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగనమోహనరెడ్డి ప్ర భుత్వం దొంగ ఓట్లు, డబ్బు పంపిణీకి పా ల్పడి నా ఓడిందన్నారు. ప్రజలు జగన ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకతతో ఉన్నారన్నారు. విద్యావంతులు, ఉద్యోగ ఉపాధ్యాయులు, నిరుద్యోగులను నమ్మించి మోసం చేయడమే ఇందుకు కారణమన్నారు. సొంత జిల్లాలో జగనకు జిల్లా ప్రజలు బుద్ధి చెప్పడం చెం పపెట్టు అన్నారు. ప్రభుత్వం పట్ల అన్ని ప్రాంతాల్లో అన్ని వర్గాల్లో అసంతృప్తి స్పష్టంగా కని పిస్తోందన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రులు రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారని, ఇప్పటికైనా రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించే నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించాలన్నారు. టీడీపీకి ఓ ట్లు వేసి గెలిపించిన అందరికీ టీడీపీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి గడ్డం శ్రీను పాల్గొన్నారు.