సైకో పాలనకు త్వరలో చరమగీతం: టీడీపీ
ABN , First Publish Date - 2023-03-18T23:45:44+05:30 IST
రానున్న సాధారణ ఎన్నికల్లో సైకో పాలనకు చరమగీతం పలికేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.

కడప (మారుతీనగర్), మార్చి 18: రానున్న సాధారణ ఎన్నికల్లో సైకో పాలనకు చరమగీతం పలికేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. శనివారం స్థానిక ఎనటీఆర్ సర్కిల్ వద్ద గల నందమూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచిపెట్టారు. టీడీపీ రాష్ట్ర నాయకులు ఎస్. గోవర్థనరెడ్డి, సీనియర్ నేత జి. లక్ష్మీరెడ్డి, 49వ డివిజన కార్పొరేటర్ ఉమాదేవి, వికాస్ హరి, జి. మనమోహనరెడ్డి, సానపురెడ్డి శివకొండారెడ్డి, సానపురెడ్డి రవిశంకర్‌రెడ్డి, ఎం.పి.సురేష్, కె.సుబ్బరాయుడు, జనార్థనరావు, జయకుమార్, చిట్టిబోయిన సుబ్బరాయుడు, కొండా సుబ్బయ్య, మాసా కోదండరామ్, ఏలియా, జయశేఖర్, అనిల్ పాల్గొన్నారు.