రోగులకు మెరుగైన వైద్య సేవలందించండి
ABN , First Publish Date - 2023-02-07T23:15:11+05:30 IST
ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన సేవలను అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి లక్ష్మి సూచిం చారు.
కురబలకోట, ఫిబ్రవరి 7: ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన సేవలను అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి లక్ష్మి సూచిం చారు. మంగళవారం మండలంలోని కనసాని వారిపల్లెలో 104 సేవలు, స్థానిక ప్రభుత్వాసు పత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఆశ కార్య కర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబల కుండా ముందస్తు జాగ్రత్తలు పాటించడంపై గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గర్భిణులను గుర్తించ డంతో పాటు, అన్ని పరీక్షలు చేయించాలన్నారు. గర్భి ణులపై ప్రత్యేక దృష్టి సారించి మాతా శిశుమరణాలు సంభవించకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆసుపత్రిలో రికార్డులను తనిఖీ చేసి రోగుల సమస్యలను అడిగి తెలుసు కున్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి శ్రీధర్, 104 వైద్యాధికారి వెంకటస్వామి, సీహెచవో జయచంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
తంబళ్లపలె: వైద్య సేవల్లో ఆశ కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమైనదని సీహెచవో సుమతి, ఎంపీహెచఈవో వెంకట్రమణ పేర్కొన్నారు. మంగళవారం కోసువారిపల్లె పీహెచసీలో ఆశ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సీహెచ ఎన సుమలత, సూపర్‌వైజర్లు లలితమ్మ, ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ములకలచెరువు: హైరిస్క్ గర్భిణుల విషయం లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వై ద్యాధికారిణి జాహ్నవి తెలిపారు. స్ధానిక ప్రభుత్వాస్పత్రిలో ఆశ కార్యకర్తలతో ఆమె మాట్లాడారు. ఎంపీ హెచఈవో రమణయ్య, సీహెచవో షకీలాబేగం, నోడల్ ఆఫీసర్ అమరావతమ్మ, ఎఎనఎంలు తదితరులు పాల్గొన్నారు.
సిమ్ కార్డుల పంపిణీ
నిమ్మనపల్లె: మండలంలో పనిచేస్తున్న ఏఎనఎం లకు సిమ్ కార్డులు పంపిణీ చేసినట్లు వైద్యాధి కారి జులేఖాబేగం తెలిపారు. చిన్నపిల్లలు, బా లింతల వివరాలను సేకరించి అప్‌లోడ్ చేసేం దుకు గాను జియో, ఎయిర్‌టెల్ సిమ్‌కార్డులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో వైద్య సిబ్బంది రామచంద్ర, శ్రీనివాసులు, సరోజ, దేవకుమారి, మల్లిక పాల్గొన్నారు.