కేంద్ర బడ్జెట్‌పై 9న నిరసనలు

ABN , First Publish Date - 2023-02-06T22:36:06+05:30 IST

వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారాలు చూపని కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ కడపలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయం బీఎ్‌సఎన్‌ఎల్‌, పోస్టాఫీసు ఎదుట ఈ నెల 9న నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఏపీ రైతు సంఘాల జిల్లా కార్యదర్శులు దస్తగిరిరెడ్డి, ఈశ్వరయ్య, జిల్లా అధ్యక్షుడు ఎంవీ సుబ్బారెడ్డి తెలిపారు.

కేంద్ర బడ్జెట్‌పై 9న నిరసనలు

కడప (సెవెన్‌రోడ్స్‌), ఫిబ్రవరి 6 : వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారాలు చూపని కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ కడపలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయం బీఎ్‌సఎన్‌ఎల్‌, పోస్టాఫీసు ఎదుట ఈ నెల 9న నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఏపీ రైతు సంఘాల జిల్లా కార్యదర్శులు దస్తగిరిరెడ్డి, ఈశ్వరయ్య, జిల్లా అధ్యక్షుడు ఎంవీ సుబ్బారెడ్డి తెలిపారు. జిల్లా పరిషత్‌ ఆవరణంలో సోమవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి నిధులు తగ్గిస్తే రైతుల ఆదాయం ఏ రకంగా రెట్టింపు అవుతుందని ప్రశ్నించారు. 2022-23 బడ్జెట్‌లో పీఎం కిసాన్‌ నిధికి రూ.12.950 కోట్లు ఉంటే 10787 కోట్లకు తగ్గించారన్నారు. పీఎం కిసాన్‌ కింద రూ.6వేలు ఇస్తున్నారని, ఇది ఏ మాత్రం చాలడంలేదన్నారు. వ్యవసాయ సాగు ఖర్చులు రెట్టింపు అయ్యాయని, బడ్జెట్‌లో పీఎం కిసాన్‌ పథకాన్ని కూడా రెట్టింపు చేయాలని వారు తెలిపారు. కార్మికులకు కోరికలకు ఈ బడ్జెట్‌ ఎటువంటి పరిష్కారం చూపలేరని విమర్శించారు. బీజేపీ విధానాలు కార్పోరేట్‌ శక్తుల అభివృద్ధి కోసం తప్ప ప్రజల కొరకు కాదన్నారు. రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక కేంద్ర బడ్జెట్‌ నిరసిస్తూ 9న జరిగే నిరసన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు.

Updated Date - 2023-02-06T22:36:10+05:30 IST