అడవులు, వన్యప్రాణుల రక్షణ అందరి బాధ్యత
ABN , First Publish Date - 2023-03-18T23:31:44+05:30 IST
అడవులు, వన్య ప్రాణుల రక్షణ అందరి బాధ్యత అని చిట్వేలి ఫారెస్ట్ ఇన్‌చార్జి రేంజర్ ఆర్. నారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం స్థానిక అటవీ శాఖ కార్యాల యంలో చిట్వేలి, కొండూరు శాఖ అధి కారులతో కలిసి ప్రజలకు అవగాహన కల్పించారు.

చిట్వేలి, మార్చి 18 : అడవులు, వన్య ప్రాణుల రక్షణ అందరి బాధ్యత అని చిట్వేలి ఫారెస్ట్ ఇన్‌చార్జి రేంజర్ ఆర్. నారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం స్థానిక అటవీ శాఖ కార్యాల యంలో చిట్వేలి, కొండూరు శాఖ అధి కారులతో కలిసి ప్రజలకు అవగాహన కల్పించారు. అడవి జంతువులను వే టాడటం, అటవీ సంపదను దొంగలిం చడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని చిట్వేలి ఎఫ్‌ఎస్‌వో శ్రీనివాసులు, కొండూరు ఎఫ్‌ఎస్‌వో సావిత్రమ్మ అవగాహన కల్పించారు. ఈ కార్య క్రమంలో అటవీ శాఖ బీట్ అధికారులు వెంకట సుబ్బమ్మ, కరిముల్లా బాష, కె.వి. సుబ్బయ్య, సీహెచ్‌ఎస్ సభ్యులు ఇంతియాజ్, అహమ్మద్, గాల శివారెడ్డి, ప్రజలు, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
సిద్దవటం : జంతువుల సంరక్షణ సామాజిక బాధ్యత అని డిప్యూటీ రేంజ్ అధికారి ఓబు లేసు తెలిపారు. సిద్దవటం మండలంలోని కమ్మపాలెం, జంగాలపల్లె, సిద్దవటం గ్రామా ల్లో జంతు సంరక్షణపై అవగాహన కల్పించారు. చాలామంది జంతువుల ఆవాసాల నాశనం చేస్తున్నారని, స్మగ్లర్లు ఎర్రచందనం కోసంఅడవులను నరుకుతున్నారని దీంతో నీటి వనరులు పూర్తిగా నాశనం అయ్యే ప్రమాదం ఉందన్నారు. వర్షాలు పడకపోతే ఎడారిగా మారుతాయని తెలియజేశారు. బీట్ ఆఫీసర్లు రాజశేఖర్‌రెడ్డి, ఓబులేసు, పెంచల్‌రెడ్డి, సప్తగిరి పరిరక్షణ సమితి ఎన్జీవోలు సప్తగిరి మునయ్య, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ హైమావతి, గ్రామ సర్పంచ్ ప్రతినిధి ఓబులయ్య, ప్రజలు పాల్గొన్నారు.