‘భారతీయ సినిమాకు గర్వకారణం’

ABN , First Publish Date - 2023-03-14T00:09:51+05:30 IST

అంతర్జాతీయ వేదికపై ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ అవార్డు సొంతం చేసుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం భారతీయ సినిమాకు గర్వకారణమని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓంటేరు శ్రీనివాసులరెడ్డి సోమవారం ఓక ప్రకటనలో పేర్కొన్నారు.

‘భారతీయ సినిమాకు గర్వకారణం’

కడప (ఎర్రముక్కపల్లె), మార్చి 13 : అంతర్జాతీయ వేదికపై ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ అవార్డు సొంతం చేసుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం భారతీయ సినిమాకు గర్వకారణమని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓంటేరు శ్రీనివాసులరెడ్డి సోమవారం ఓక ప్రకటనలో పేర్కొన్నారు. అందులోనూ ఆ చిత్రంలోని తెలుగు పాట కు పురస్కారం దక్కడం మరింత సంతోకరమన్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా తెలుగు చిత్రం సత్తా చాటిన ఆర్‌ఆర్‌ఆర్‌ ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో తెలుగు వెలుగులు విర.జిమ్మడం హర్షణీయమన్నారు. అంత గొప్ప చిత్రాన్ని ప్రేక్షకులకందించిన చిత్ర దర్శకుడు రాజమౌళి, నటులు, నాటు నాటు పాట సంగీత దర్శకుడు, గీత రచయితకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో హాలీవుడ్‌ స్థాయిని తలదన్నే చిత్రాలను నిర్మించే సత్తా తెలుగువారికి ఉందనే సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2023-03-14T00:09:51+05:30 IST